
యుజ్వేంద్ర చాహల్ సతీమణి ధనశ్రీ వర్మ తన భర్తతో పాటు ఇంగ్లాండ్ క్రికెటర్ జోస్ బట్లర్ కు డ్యాన్స్ నేర్పిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. భారత టీ 20 లీగ్ 15వ సీజన్ లో రాజస్థాన్ తరపున ఈ ఇద్దరూ అత్యుత్తమ ప్రదర్శన చేశారు. జోస్ బట్లర్ మొత్తం 863 పరుగులతో ఈ సీజన్ లో టాప్ స్కోరర్ గా నిలిచి ఆరెంజ్ క్యాప్, చాహల్ 27 వికెట్లతో టాప్ వికెట్ టేకర్ గా పర్పుల్ క్యాప్ అందుకున్నారు. ఈ నేపథ్యంలోనే టోర్నీ పూర్తయ్యాక ధనశ్రీ సోమవారం (మే30) చాహల్, జోస్ బట్లర్ కు డ్యాన్స్ ప్రాక్టీస్ చేయిస్తున్న ఒక వీడియోను తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు చేశారు. ‘ఆరెంజ్, పర్పుల్ మధ్యలో పింక్’ అంటూ క్యాప్షన్ ఇచ్చారు.
ఈ వీడియోలో ధనశ్రీ ముందు నిల్చుని స్టెప్పులు కంపోజ్ చేస్తుండగా.. బట్లర్, చాహల్ ఆమె వెనుకాలే ప్రాక్టీస్ చేస్తూ సందడి చేశారు. చాహల్ కాసేపు డ్యాన్స్ ప్రాక్టీస్ చేసి, ఇక తన వల్ల కాదని పక్కకు తప్పుకున్నాడు. బట్లర్ మాత్రం చాలా కష్టపడి ధనశ్రీలా డ్యాన్స్ చేసేందుకు ప్రయత్నించడం నవ్వులు పూయిస్తోంది.
ఈ ఏడాది ఐపీఎల్ లో అద్భుతంగా రాణించిన జట్లలో రాజస్థాన్ రాయల్స్ ఒకటి. ఐపీఎల్ తొలి సీజన్ లో ట్రోఫీ నెగ్గిన ఆ జట్టు.. ఆ తర్వాత చెప్పుకోదగ్గ స్థాయిలో ప్రదర్శన చేయలేదు. అలాంటిది 14 ఏళ్ల తర్వాత మళ్లీ ఫైనల్ చేరింది. ఈ సారి ఎలాగైనా కప్పు కొడుతుందని క్రికెట్ ఫ్యాన్స్ అనుకున్నా.. గుజరాత్ టైటాన్స్ చేతిలో ఓటమి పాలైంది.
మరిన్ని వార్తల కోసం..
ట్రెండ్ సెట్టర్.. సూపర్ స్టార్ కృష్ణ 52 ఏళ్ల సినీ ప్రస్థానం