స్పై బ్యాచ్ ముందే ప్లాన్ చేసుకున్నారా? వైరల్ అవుతున్న వీడియో

స్పై బ్యాచ్ ముందే ప్లాన్ చేసుకున్నారా? వైరల్ అవుతున్న వీడియో

బిగ్ బాస్ సీజన్ 7(Bigg boss season7) ముగిసింది. ఈ సీజన్ కు పల్లవి ప్రశాంత్ విన్నర్(Pallavi Prashanth) గా నిలిచారు. దీంతో అతని ఫ్యాన్స్ ఫుల్లు హ్యాపీగా సంబరాలు చేసుకున్నారు. నిజానికి ఈ సీజన్ లో స్పై బ్యాచ్ చాలా ఫేమ్ అయ్యారు. శివాజీ, పల్లవి ప్రశాంత్, యావర్ ఈ బ్యాచ్ లో ఉన్నారు. ఒకరికి ఒకరు సపోర్ట్ చేసుకుంటూ, నామినేట్ చేసుకోకుకండా చాలా సేఫ్ గా గేమ్ ఆడుతూ వచ్చారు. మాస్టర్ మైండ్ శివాజీ ఈ బ్యాచ్ ను ముందుండి నడిపించారు. ఏ ఏ సమయాల్లో ఎలా రియాక్ట్ అవ్వాలో చెప్తూ.. విన్నర్ వరకు తీసుకొచ్చారు.

అయితే స్పై బ్యాచ్ పై ముందు నుండే చాలా అనుమానాలు నెలకొన్నాయి. శివాజీ కూడా ఈ షోకి ముందు ఇద్దరినీ కలవలేదని, ఇక్కడికి వచ్చాకే ఫ్రెండ్స్ అయ్యామని చెప్పుకొచ్చారు. అదంతా నిజమేనని జనాలు కూడా నమ్మారు. దాంతో స్పై బ్యాచ్ పై జనాల్లో పాపులారిటీ వచ్చింది. ఈ బ్యాచ్ నుండే ఎవరో ఒకరు విన్నర్ అవుతారని ఆడియన్స్ అనుకున్నారు. ఫైనల్ గా అదే నిజమయ్యింది. 

ఇదంతా బాగానే ఉంది కానీ.. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో పల్లవి ప్రశాంత్ యావర్ బిగ్ బాస్ కు ముందే కలిసినట్టుగా ఉంది. ఆ వీడియోలో పల్లవి ప్రశాంత్, యావర్ చాలా క్లోజ్ గా మాట్లాడుకుంటూ కనిపించారు. దీంతో స్పై బ్యాచ్ ముందే ప్లాన్ చేసుకొని వచ్చారనే కామెంట్స్ వినిపిస్తన్నాయి. ఇది చూసిన స్పై ఫ్యాన్స్ సైతం ఒక్కసారిగా అవాక్కవుతున్నారు. జనాలను మోసం చేసారంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ వీడియోపై మీ స్పందన ఏంటో చెప్పండి.