చర్లపల్లి రైల్వేస్టేషన్ ​గోడ కూలింది

చర్లపల్లి రైల్వేస్టేషన్ ​గోడ కూలింది

కారేపల్లి, వెలుగు : కారేపల్లి మండలం చర్లపల్లిలో రూ.9 కోట్లతో చేపట్టిన కొత్త రైల్వే స్టేషన్ పనులు ఏడాదిగా కొనసాగుతున్నాయి. రైల్వే ఇంజినీరింగ్ అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో పనుల్లో క్వాలిటీ లోపిస్తోంది. ఫ్లాట్​ఫాంను ఆనుకొని ఇటీవల నిర్మించిన ప్రహరీగోడ శుక్రవారం కురిసిన చిన్నవానకే కూలిపోయింది. రైల్వేస్టేషన్ బిల్డింగ్​గోడలు పూర్తి కాకుండానే బీటలు వారుతున్నాయి.