సిరీస్‌‌‌‌ ఎవరిదో?.. రెండో టెస్టుకు వాన గండం

సిరీస్‌‌‌‌ ఎవరిదో?.. రెండో టెస్టుకు వాన గండం
  • నేటి నుంచి ఇండియా, న్యూజిలాండ్‌‌‌‌‌‌‌‌ సెకండ్‌‌‌‌‌‌‌‌ టెస్ట్‌‌‌‌‌‌‌‌
  • మ్యాచ్​కు వాన ముప్పు 
  • ఉ. 9.30 నుంచి స్టార్‌‌‌‌‌‌‌‌ స్పోర్ట్స్‌‌‌‌‌‌‌‌లో

ముంబై: టీమిండియా, న్యూజిలాండ్ మధ్య మొదలవ్వాల్సిన రెండో టెస్టుకు వర్షం గండంగా మారింది. టాస్ కు ముందే వాన పడటంతో మ్యాచ్ ఆలస్యమవుతోంది. కాగా, ఫస్ట్‌‌‌‌‌‌‌‌ టెస్ట్‌‌‌‌‌‌‌‌లో గెలుపు అంచుల వరకు వచ్చి ఆగిపోయిన ఇండియా.. కీలక పోరుకు సిద్ధమైంది. శుక్రవారం నుంచి జరిగే సెకండ్‌‌‌‌‌‌‌‌ టెస్ట్‌‌‌‌‌‌‌‌లో న్యూజిలాండ్‌‌‌‌‌‌‌‌తో అమీతుమీ తేల్చుకోనుంది. ఫస్ట్​ టెస్టు డ్రా అవగా.. ఈ మ్యాచ్​లో గెలిచి సిరీస్‌‌‌‌‌‌‌‌ కైవసం చేసుకోవాలని రెండు టీమ్స్​ ఆశిస్తున్నాయి. ముంబైలో అదరగొట్టి సిరీస్​ నెగ్గడంతోపాటు ఫుల్‌‌‌‌‌‌‌‌ కాన్ఫిడెన్స్‌‌‌‌‌‌‌‌తో సౌతాఫ్రికా టూర్‌‌‌‌‌‌‌‌ను మొదలుపెట్టాలని కోహ్లీసేన టార్గెట్‌‌‌‌‌‌‌‌గా పెట్టుకుంది. అయితే, ముంబైలో 2016 తర్వాత జరుగుతున్న ఈ టెస్టుకు వాన ముప్పు ఉంది. రెండు రోజుల నుంచి ఇక్కడ వాన పడుతోంది. దాంతో, టీమిండియా గురువారం బాంద్రాకుర్లా కాంప్లెక్స్​లోని ఇండోర్​ నెట్స్​లో ప్రాక్టీస్​ చేసింది. శుక్రవారం కూడా వర్ష సూచన ఉండటం ఆందోళన కలిగిస్తోంది.

రహానెను తీసేస్తరా?

టీ20 వరల్డ్​కప్​ తర్వాత రెస్ట్​ తీసుకున్న కోహ్లీ ఈ మ్యాచ్​లో టీమ్​ను లీడ్​ చేస్తున్నాడు.  ఈ ఏడాది ఒక్క సెంచరీ కొట్టని విరాట్​ వాంఖడేలో సత్తా చాటాలని చూస్తున్నాడు. అయితే, కోహ్లీ రాకతో టీమిండియా ఫైనల్‌‌‌‌‌‌‌‌ ఎలెవన్‌‌‌‌‌‌‌‌పై కొత్త తలనొప్పులు మొదలయ్యాయి. తన కోసం  ఒకరిని తీసేయాలి. లాస్ట్‌‌‌‌‌‌‌‌ 12 మ్యాచ్‌‌‌‌‌‌‌‌ల్లో ఫెయిలైనా వైస్‌‌‌‌‌‌‌‌ కెప్టెన్‌‌‌‌‌‌‌‌ రహానెను తప్పిస్తారా? కాన్పూర్‌‌‌‌‌‌‌‌లో సెంచరీ,  హఫ్‌‌‌‌‌‌‌‌ సెంచరీ  కొట్టిన శ్రేయస్‌‌‌‌‌‌‌‌పై వేటు వేస్తారా? లేదంటే ఈ మ్యాచ్​ వరకు ఓపెనర్​ మయాంక్‌‌‌‌‌‌‌‌ను పక్కనబెట్టి ఇంకెవరికైనా ప్రమోషన్‌‌‌‌‌‌‌‌ ఇస్తారా? అన్నది ఆసక్తికరంగా మారింది. మయాంక్​ను తీసేస్తే  వికెట్‌‌‌‌‌‌‌‌ కీపర్‌‌‌‌‌‌‌‌ భరత్‌‌‌‌‌‌‌‌ను ఓపెనర్‌‌‌‌‌‌‌‌గా పంపొచ్చు. మెడ నొప్పితో బాధపడుతున్న సాహా ప్లేస్‌‌‌‌‌‌‌‌లో భరత్‌‌‌‌‌‌‌‌ను తీసుకుంటేనే ఇది సాధ్యమవుతుంది.  

సాహా ఇప్పుడు ఫిట్​గానే ఉన్నాడని కోహ్లీ చెప్పాడు. పైగా ఫస్ట్​ మ్యాచ్​ సెకండ్​ ఇన్నింగ్స్​లో తను టీమ్​ను సేవ్​ చేశాడు. అదే టైమ్​లో సౌతాఫ్రికా టూర్‌‌‌‌‌‌‌‌ను దృష్టిలో పెట్టుకుని రహానె, పుజారాను ఎట్టి పరిస్థితుల్లోనూ కోహ్లీ కదిలించకపోవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. ఎందుకంటే సఫారీ గడ్డపై కొత్త కుకాబురా బాల్‌‌‌‌‌‌‌‌ను దీటుగా ఎదుర్కోవాలంటే ఈ ఇద్దరూ అవసరం. కాబట్టి.. ఈ టైమ్​లో టీమ్​ నుంచి తప్పించి వాళ్ల కాన్ఫిడెన్స్‌‌‌‌‌‌‌‌ను దెబ్బతీయడం మంచిది కాదనే భావన కూడా ఉంది. మరి, కోహ్లీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో చూడాలి. ఇక, వెదర్​ను దృష్టిలో ఉంచుకొని ఈ మ్యాచ్​లో ఎక్స్​ట్రా పేసర్​ను ఆడించే చాన్సుందని కోహ్లీ హింట్​ ఇచ్చాడు. దాంతో, ముగ్గురు స్పిన్నర్లలో ఒకరిని తప్పించి పేసర్‌‌‌‌‌‌‌‌ మహ్మద్‌‌‌‌‌‌‌‌ సిరాజ్‌‌‌‌‌‌‌‌ను తీసుకునే అవకాశం ఉంది. ఇద్దరే కావాలనుకుంటే ఫస్ట్​ మ్యాచ్​లో ఫెయిలైన ఇషాంత్‌‌‌‌‌‌‌‌ పై వేటు పడొచ్చు. ఓవరాల్‌‌‌‌‌‌‌‌గా సిరీస్‌‌‌‌‌‌‌‌ దక్కాలంటే స్ట్రాంగ్‌‌‌‌‌‌‌‌ టీమ్​తో టీమిండియా బరిలోకి దిగాల్సిందే. 

వాగ్నర్​.. వచ్చిండు

కాన్పూర్‌‌‌‌‌‌‌‌ టెస్ట్‌‌‌‌‌‌‌‌ మిస్‌‌‌‌‌‌‌‌ అయిన పేసర్‌‌‌‌‌‌‌‌ నీల్​ వాగ్నర్‌‌‌‌‌‌‌‌ ఈ మ్యాచ్‌‌‌‌‌‌‌‌కు అందుబాటులోకి రావడం కివీస్‌‌‌‌‌‌‌‌కు బాగా కలిసొచ్చే అంశం. సెకండ్‌‌‌‌‌‌‌‌ ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌లో అతని బౌలింగ్‌‌‌‌‌‌‌‌ వల్ల టీమిండియాకు మరింత ప్రమాదం పొంచి ఉంది. కివీస్​ ముగ్గురు పేసర్లతో బరిలోకి దిగాలని చూస్తోంది. దాంతో, ఫస్ట్​ టెస్ట్‌‌‌‌‌‌‌‌లో రాణించిన స్పిన్నర్​ సోమర్‌‌‌‌‌‌‌‌విల్లేకు టీమ్​లో చోటు కష్టంగా మారింది. ఓపెనింగ్‌‌‌‌‌‌‌‌లో విల్​ యంగ్‌‌‌‌‌‌‌‌, లాథమ్‌‌‌‌‌‌‌‌ ఇచ్చే గుడ్‌‌‌‌‌‌‌‌ స్టార్ట్‌‌‌‌‌‌‌‌పైనే టీమ్‌‌‌‌‌‌‌‌ విక్టరీ ఆధారపడి ఉంటుంది. మిడిలార్డర్‌‌‌‌‌‌‌‌లో కేన్​, టేలర్‌‌‌‌‌‌‌‌, నికోల్స్‌‌‌‌‌‌‌‌, బ్లండెల్‌‌‌‌‌‌‌‌ నిలబడితే భారీ స్కోరు ఖాయం. ఇక స్పిన్నర్లుగా రచిన్‌‌‌‌‌‌‌‌, అజాజ్‌‌‌‌‌‌‌‌ కీలకం కానున్నారు.  

పిచ్‌‌‌‌‌‌‌‌ ఎట్లుందంటే... 

వర్షం కారణంగా పిచ్‌‌‌‌‌‌‌‌ పెద్దగా డ్రై కాలేదు. దీంతో స్వింగ్​, ఎక్స్‌‌‌‌‌‌‌‌ట్రా బౌన్స్‌‌‌‌‌‌‌‌ను ఆశిస్తున్నారు. రెండు జట్లూ.. ఎక్స్‌‌‌‌‌‌‌‌ట్రా పేసర్‌‌‌‌‌‌‌‌తో బరిలోకి దిగే చాన్స్‌‌‌‌‌‌‌‌ ఉంది. మొత్తానికి పిచ్‌‌‌‌‌‌‌‌ పేసర్లు, స్పిన్నర్లకు ఈక్వల్‌‌‌‌‌‌‌‌గా అనుకూలించొచ్చు. 

టీమ్స్​ ఇట్లుండొచ్చు

ఇండియా: కోహ్లీ (కెప్టెన్‌‌‌‌‌‌‌‌), గిల్‌‌‌‌‌‌‌‌, మయాంక్‌‌‌‌‌‌‌‌, పుజారా, శ్రేయస్‌‌‌‌‌‌‌‌ అయ్యర్‌‌‌‌‌‌‌‌, జడేజా, సాహా, అశ్విన్‌‌‌‌‌‌‌‌, అక్షర్‌‌‌‌‌‌‌‌ పటేల్‌‌‌‌‌‌‌‌, సిరాజ్‌‌‌‌‌‌‌‌, ఉమేశ్‌‌‌‌‌‌‌‌. 
న్యూజిలాండ్‌‌‌‌‌‌‌‌: విలియమ్సన్‌‌‌‌‌‌‌‌ (కెప్టెన్‌‌‌‌‌‌‌‌), విల్‌‌‌‌‌‌‌‌ యంగ్‌‌‌‌‌‌‌‌, లాథమ్‌‌‌‌‌‌‌‌, టేలర్‌‌‌‌‌‌‌‌, నికోల్స్‌‌‌‌‌‌‌‌, బ్లండెల్‌‌‌‌‌‌‌‌, రచిన్‌‌‌‌‌‌‌‌ రవీంద్ర, జెమీసన్‌‌‌‌‌‌‌‌, సౌథీ, వాగ్నర్‌‌‌‌‌‌‌‌, అజాజ్‌‌‌‌‌‌‌‌ పటేల్‌‌‌‌‌‌‌‌.