మహిళను కొట్టి, లాక్కొచ్చి క్యాబ్లోకి ఎక్కించారు

మహిళను కొట్టి, లాక్కొచ్చి క్యాబ్లోకి ఎక్కించారు

మహిళలపై దాడులు ఆగడం లేదు. ఎక్కడ చూసినా వాళ్లపై అగాయిత్యాలకు పాల్పడుతూనే ఉన్నారు. కళ్ల ముందు జరుగుతున్న దాడులను ఆపాలని, అగాయిత్యాలకు పాల్పడే వాళ్లను ఎదిరించి మహిళలను కాపాడాలని ఎవరూ అనుకోవడం లేదు. తాజాగా ఇలాంటి ఒక సంఘటనే దేశ రాజధాని ఢిల్లీలో వెలుగులోకి వచ్చింది. నడి రోడ్డుపై ఓ మహిళను జుట్టుపట్టుకుని లాక్కొచ్చి, కొట్టి, క్యాబ్ లోకి ఎక్కించిన  వీడియోని ఢిల్లీ పోలీసులు లీక్ చేశారు. ఈ ఘటన వైరల్  అవుతోంది

వీడియోలో ఇద్దరు వ్యక్తులు ఉబెర్ క్యాబ్ బుక్ చేసుకొని మహిళలో పాటు వెళ్తుంటారు. అంతలోనే మహిళ క్యాబ్ దిగి వెళ్లిపోతుంటుంది. తన వెనకాలే వెళ్లిన వ్యక్తి ఆ మహిళను కొట్టుకుంటూ, జట్టు పట్టుకొపి లాక్కొచ్చి క్యాబ్ లో పడేస్తాడు. క్యాబ్ లో కూడా మహిళపై దాడి చేస్తాడు. అక్కడే ఉన్న జనాలు, క్యాబ్ డ్రైవర్, ఆ మహిళతో వచ్చిన రెండో వ్యక్తి ఇదంతా చూస్తూ నిలబడ్డారు తప్ప వాళ్లను ఆపేందుకు ప్రయత్నించడం లేదు. 

క్యాబ్ నెంబర్ ప్లేట్ ఆధారంగా డ్రైవర్ ను కనుగొని, క్యాబ్ బుకింగ్ ని ట్రేస్ చేయడానికి ఢిల్లీ పోలీసులు ప్రయత్నిస్తున్నారు. దాడి చేసిన వాళ్లను పట్టుకొని కేసు నమోదు చేసే అవకాశం కనిపిస్తోంది.