ఎమ్మెల్యేను ప్రశ్నించిందని అరెస్ట్‌‌ చేసిన్రు

ఎమ్మెల్యేను ప్రశ్నించిందని అరెస్ట్‌‌ చేసిన్రు
  • బెంగళూరులో ఘటన

బెంగళూరు: కర్నాటకలోని బెంగళూరులో భూ ఆక్రమణకు సంబంధించి బీజేపీ ఎమ్మెల్యే అరవింద్‌‌ లింబావలికి వినతిపత్రం ఇవ్వడానికి వచ్చిన ఓ మహిళను అరెస్ట్‌‌ చేశారు. వినతి పత్రం ఇస్తుండగా ఎమ్మెల్యే ఆ మహిళలను తిడుతున్న వీడియో వైరల్‌‌గా మారింది. వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు నియోజకవర్గంలో పరిస్థితిని చూసేందుకు శుక్రవారం ఆయన ఇక్కడికి వచ్చారు. ఆ సమయంలో ఈ ఘటన జరిగింది.

దీనిపై ప్రశ్నించేందుకు పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ఈ వీడియో క్లిప్‌‌పై ప్రతిపక్ష కాంగ్రెస్‌‌ పార్టీ బీజేపీపై మండిపడింది. మహదేవపుర నియోజకవర్గంలో భూ ఆక్రమణలు జరుగుతున్నాయని, దీనిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేసేందుకు ఆ మహిళ లింబావలిని కలిసింది. ఈ క్రమంలో ఆయన ఆమెపై గట్టిగా అరుస్తూ తిట్టారు. అయితే, మంచిగా మాట్లాడమని ఆ మహిళ ఎమ్మెల్యేను కోరగా, ఆమే ఒక ఆక్రమణదారు.. ఇంతకంటే ఎక్కువ మాట్లాడటానికి ఏమీ లేదని చెప్పాడు.