లంచం తీసుకున్నాడని VROను నిలదీసిన మహిళ

లంచం తీసుకున్నాడని VROను నిలదీసిన మహిళ

మహబూబాబాద్ జిల్లా : లంచం తీసుకొని పట్టా పాస్ పుస్తకం ఎందుకు ఇవ్వట్లేదంటూ VROను నిలదీసింది ఓ మహిళా రైతు. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండల తహసిల్ధార్ ఆఫీసులో ఈ సంఘటన జరిగింది. మదనాపురం గ్రామానికి చెందిన ఊర్మిళకు తల్లిదండ్రులు ఎకరం భూమి ఇచ్చారు.

ఆ భూమిని తన పేరుపై బదిలీ చేసేందుకు VRO ఉదయ్ కి 25  వేలు ఇచ్చినట్టు చెప్పింది. మూడేళ్ళయినా పాస్ పుస్తకాలు రాకపోవడంతో రెవెన్యూ ఆఫీసులోనే VROను నిలదీసింది. తర్వాత పోలీస్ స్టేషన్ లో కలెక్టరేట్ ప్రజావాణిలో కంప్లయింట్ ఇచ్చింది.