రెగ్యులర్ స్మార్ట్ఫోన్స్తో పోల్చితే ఫోల్డింగ్ ఫోన్స్ ఖరీదు చాలా ఎక్కువ. డబుల్ ఫోల్డింగ్ స్మార్ట్ ఫోన్స్ కొన్నేళ్ల నుంచి మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ఈ డబుల్ ఫోల్డబుల్ ఫోన్ అమ్మకాల్లో శామ్ సంగ్ కంపెనీ ముందు వరుసలో ఉంది. కానీ.. ఇప్పుడు ఈ ఫోల్డింగ్ ఫోన్స్ రూపకల్పనలో చైనాకు చెందిన టెక్ దిగ్గజ కంపెనీల్లో ఒకటైన హువాయి మరో అడుగు ముందుకేసింది.
ఐఫోన్ 16 (iPhone 16) లాంచ్ అయి దాని గురించి చర్చ జరుగుతున్న తరుణంలోనే ట్రిపుల్ ఫోల్డింగ్ ఫోన్ను విడుదల చేసి హువాయి కంపెనీ అందరి దృష్టిని ఆకర్షించింది. సెప్టెంబర్ 20 నుంచి ఈ ట్రిపుల్ ఫోల్డింగ్ ఫోన్ల అమ్మకాలు మొదలవుతాయని ఈ చైనా కంపెనీ ప్రకటించింది. హువాయి మేట్ ఎక్స్టి (Huawei Mate XT) ట్రిఫుల్ స్క్రీన్ ఫోల్డబుల్ మొబైల్ ధర 2,800 డాలర్లు. భారత కరెన్సీలో చెప్పాలంటే.. 2,35,154 రూపాయలు.
హువాయి మేట్ ఎక్స్టి అల్టిమేట్ డిజైన్ ఫీచర్లు:
* 10.2 అంగుళాల ఫ్లెక్సిబుల్ ఎల్టీపీఓ ఓఎల్ఈడీ డిస్ప్లే
* వన్స్ ఫోల్డ్ చేస్తే 7.9 అంగుళాల స్క్రీన్, ట్వైస్ ఫోల్డ్ చేస్తే 6.4 అంగుళాల తగ్గనున్న స్క్రీన్ పరిమాణం
* 16జీబీ ర్యామ్, 256జీబీ ఇంటర్నల్ స్టోరేజ్
* డార్క్ బ్లాక్, రుయి రెడ్ కలర్
* 298 గ్రాముల బరువు
* 156.7x73x12.8mm (సింగిల్ స్క్రీన్), 156.7x143x7.45mm (డ్యుయల్ స్క్రీన్), 156.7x219x3.6mm (ట్రిపుల్ స్క్రీన్)
* 50 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS), 12 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ కెమెరా, 12 మెగాపిక్సెల్ పెరిస్కోప్ టెలీఫొటో లెన్స్
* 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ఫేసింగ్ కెమెరా
* 5,600 ఎంఏహెచ్ బ్యాటరీ, 66W వైర్డ్ ఛార్జింగ్, 50W వైర్లెస్ ఛార్జింగ్
* 5G, 4G LTE, Wi-Fi 6, Bluetooth 5.2, GPS, NFC, USB 3.1 Type-C port