TSGENCO: అసిస్టెంట్ ఇంజినీర్, కెమిస్ట్ పరీక్షలు వాయిదా

TSGENCO: అసిస్టెంట్ ఇంజినీర్, కెమిస్ట్ పరీక్షలు వాయిదా

తెలంగాణ రాష్ట్ర పవర్ జెనరేషన్ కార్పొరేషన్ లిమిటెడ్‌‌లో అసిస్టెంట్ ఇంజినీర్, కెమిస్ట్ పోస్టుల భర్తీకి గతేడాది అక్టోబరు 5న నోటిఫికేషన్లు వెలువడిన సంగతి తెలసిందే. దీనిద్వారా 339 ఏఈ పోస్టులు, 60 కెమిస్ట్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. అసిస్టెంట్ ఇంజినీర్(ఏఈ), కెమిస్ట్ ఉద్యోగాల నియామక రాతపరీక్ష వాయిదా పడింది. ఎన్నికల కోడ్ కారణంగా మార్చి 31న జరగాల్సిన పరీక్షలను వాయిదా వేసినట్లు జెన్‌కో ఒక ప్రకటనలో తెలిపింది.

అభ్యర్థుల నుంచి అక్టోబరు 7 నుంచి నవంబరు 10 వరకు దరఖాస్తులు స్వీకరించారు. ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత పరీక్షల తేదీని ప్రకటిస్తామని జెన్‌కో యాజమాన్యం పేర్కొంది. పరీక్షలకు సంబంధించిన హాల్‌టికెట్లను మార్చి 23న విడుదల చేయాల్సి ఉంది. అయితే మార్చి 16న లోక్‌సభ ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో పరీక్ష నిర్వహణపై అధికారులు అయోమయంలో పడ్డారు. ఎన్నికల సంఘం నుంచి అనుమతి కోసం ఎదురుచూసింది. పరీక్షల నిర్వహణకు ఎన్నికల్ సంఘం నిరాకరిచడంతో.. పరీక్షలను వాయిదావేయాల్సి వచ్చింది. సార్వత్రిక ఎన్నికల తర్వాతే పరీక్షలు నిర్వహించనున్నారు.