8ఏళ్ల ప్రేమ.. ప్రియుడి వేధింపులతో యువతి సూసైడ్

8ఏళ్ల ప్రేమ.. ప్రియుడి వేధింపులతో యువతి సూసైడ్

జీడిమెట్ల, వెలుగు: ప్రియుడు పెట్టే వేధింపులు తట్టుకోలేక యువతి సూసైడ్ చేసుకుంది. జీడిమెట్ల పోలీసులు తెలిపిన ప్రకారం... షాపూర్​నగర్​పరిధి ఎన్ఎల్ బీ నగర్​కి చెందిన అఖిల ప్రియ (22)  ప్రైవేటు ఉద్యోగి. కొంతకాలంగా ఆమెను షాపూర్​నగర్​కి చెందిన ఓరుగంటి అఖిల్​సాయిగౌడ్​ ప్రేమిస్తున్నానని వెంటపడుతూ చనిపోతానంటూ బెదిరించాడు. దీంతో అతని ప్రేమను ఆమె ఒప్పుకుంది.  

ప్రేమ విషయం యువతి ఇంట్లో చెప్పగా పెద్దలు కూడా అంగీకరించారు. అనంతరం ఆమెను సాయిగౌడ్​మానసికంగా, శారీరకంగా వేధిస్తున్నాడు. ఆమెను ఫోన్​లో తిట్టడడం, అందరి ముందు కొట్టడం చేస్తున్నాడు. దీంతో మనస్తాపం చెందిన అఖిల ప్రియ  ప్రేమ పేరుతో మోసగించాడని సూసైడ్​నోట్​రాసి  మంగళవారం రాత్రి ఉరేసుకుని చనిపోయింది. యువతి తండ్రి కుమార్​కంప్లయింట్ తో కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు.