చందాలేసుకుని.. టెస్టులు, మందులు

చందాలేసుకుని.. టెస్టులు, మందులు
  • సర్కారు పట్టించుకోకపోవడంతో ఏకమవుతున్న గ్రామాలు
  • కరోనా నిధి పేరుతో పల్లెల్లో విరాళాల సేకరణ
  • స్కూళ్లు, కమ్యూనిటీ హాళ్లలో ఐసోలేషన్‌‌‌‌ సెంటర్ల ఏర్పాటు
  • బాధితులకు ఆక్సీమీటర్లు, మెడిసిన్లు, ఆక్సిజన్‌‌‌‌, ఫుడ్‌‌‌‌ సరఫరా
  • కరోనా వలంటీర్లుగా ఏర్పడి యువత సేవలు

హైదరాబాద్‌‌‌‌, వెలుగు:రాష్ట్రంలో కరోనా బాధితులను సర్కారు పట్టించుకోకపోవడంతో తమను తాము కాపాడుకునేందుకు గ్రామాలు ఏకం అవుతున్నాయి. ఊర్లలో ప్రజలే కరోనా నిధి ఏర్పాటు చేసుకుని ప్రాణాలను కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. అనేక చోట్ల అధికారులు చేతులెత్తేయడంతో పల్లెల్లో జనమే విరాళాలు వేసుకుంటున్నారు. ప్రభుత్వంపై ఆధారపడకుండా కరోనా బాధితులకు సాయం చేస్తున్నారు. కిట్లు, ఆక్సీమీటర్లు, ఇంజెక్షన్లు, మెడిసిన్లు ఇస్తున్నారు. గ్రామాల్లోని స్కూళ్లు, ఫంక్షన్‌‌‌‌ హాళ్లు, కమ్యూనిటీ హాళ్లను ఐసోలేషన్‌‌‌‌ సెంటర్లుగా మార్చి వాడుకుంటున్నారు.

పట్టించుకునేదెవరు?

రాష్ట్రంలో కరోనా బాధితులను సర్కారు పట్టించుకోవడంలేదు. ప్రైమరీ కాంటాక్టులను గుర్తించడంలేదు. పైగా లక్షణాలు ఉన్న వారు టెస్టుల కోసం క్యూలు కడుతున్నా కిట్లు లేవని పరీక్షలు చేయడంలేదు. వచ్చిన వారిని వెనక్కి పంపిస్తున్నారు. గ్రామాల్లో రెండంకెల సంఖ్యలో కరోనా బాధితులు ఉన్నా ఐసోలేషన్‌‌‌‌ సెంటర్లు ఏర్పాటు చేయడంలేదు. అవసరమైన వారికి మెడిసిన్లు అందించడంలేదు. కనీసం అవగాహన కార్యక్రమాలు చేపట్టడంలేదు. పేషంట్లకు ధైర్యం చెప్పే ప్రయత్నం చేయడంలేదు.

ఫండ్ ఏర్పాటు చేసుకుని..

రాష్ట్రంలోని అనేక గ్రామాల్లో కరోనా నిధి ఏర్పాటు చేసుకుంటున్నారు. తీర్మానాలు చేసుకుని, ఊర్లలోని ప్రజలతోపాటు బంధువులు, స్వచ్ఛంద సంస్థల నుంచి విరాళాలు సేకరిస్తున్నారు. సాయం చేయాలని ఆన్‌‌‌‌లైన్‌‌‌‌లోనూ కోరుతున్నారు. జనం కూడా రూ.100 నుంచి రూ.10 వేల దాకా తమకు తోచినంత సాయం చేస్తున్నారు. విదేశాల్లో స్థిరపడిన వ్యక్తులు సాయానికి ముందుకు వస్తున్నారు. ఈ డబ్బులతో గ్రామాల్లో అనేక సదుపాయాలు కల్పిస్తున్నారు. ముందుగా లక్షణాలున్న వారికి టెస్టులు చేయించే ప్రయత్నం చేస్తున్నారు. మెడిసిన్లు, క్వాలిటీఫుడ్‌‌‌‌, పండ్లు, ఆక్సీమీటర్లు, ఆక్సిజన్‌‌‌‌, ఇంజెక్షన్లు అందిస్తున్నారు. ఊర్లలో ఎప్పటికప్పుడు శానిటైజ్‌‌‌‌ చేస్తున్నారు.

టీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ ప్రజాప్రతినిధులైతనే..

గ్రామాల్లో కరోనా సమస్యలపై అధికారుల దృష్టికి తీసుకొస్తే పట్టించుకోవడంలేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా గ్రామాల్లో సమస్యలపై టీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ పార్టీ ప్రజాప్రతినిధులు, లీడర్లకే స్పందిస్తున్నారు. ఇతర పార్టీల సర్పంచ్‌‌‌‌లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు ఇతర నేతలు అధికారులను సంప్రదించే ప్రయత్నం చేస్తే అందుబాటులోకి రావడంలేదు. ఫోన్‌‌‌‌ చేసినా పట్టించుకోవడంలేదు. రాష్ట్రంలోని అనేక చోట్ల ఇదే పరిస్థితి ఉందని స్థానిక లీడర్లు వాపోతున్నారు. ఇలాగైతే తమ బాధలను ఎవరికి చెప్పుకోవాలని వాపోతున్నారు. టీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ లీడర్లే ముందస్తుగా అధికారులకు చెప్పి ఇలా చేస్తున్నారని ఆరోపిస్తున్నారు.

చందాలు వేసుకుని..

మా ఊర్లో 40 శాతానికి పైగా కరోనా పాజిటివ్‌‌‌‌ రేట్‌‌‌‌ ఉంది. కిట్లు లేకపోవడంతో టెస్టులు చేయడంలేదు. నేను హైదరాబాద్‌‌‌‌లో డయాగ్నస్టిక్‌‌‌‌ సెంటర్‌‌‌‌ నడుపుతుంటాను. ఊర్లో పరిస్థితి చూసి హైదరాబాద్‌‌‌‌ నుంచి వచ్చాను. గ్రామంలో కరోనా టెస్టులు చేస్తున్నాను. విలేజ్‌‌‌‌లో కరోనా నిధి పేరుతో విరాళాలు, చందాలు సేకరించాం. వాలంటరీ టీంను ఏర్పాటు చేసి, ఈ డబ్బులతో అందరికీ మెరుగైన సేవలు అందించే ప్రయత్నం చేస్తున్నం.- రాపోలు గోపీనాథ్‌‌‌‌, గట్టుప్పలనల్గొండ జిల్లా చండూరు మండలం గట్టుప్పలలో ఈ నెల 19న 111 మందికి కరోనా టెస్టులు చేశారు. వారిలో 41 మందికి పాజిటివ్‌‌‌‌గా తేలింది. కానీ వారికి మెడికల్‌‌‌‌ ఆఫీసర్లు ఎలాంటి ట్రీట్‌‌‌‌మెంట్‌‌‌‌ ఇవ్వలేదు. కనీసం మెడిసిన్లు కూడా ఇవ్వలేదు. 10 వేల మంది ఉన్న గ్రామంలో కిట్లు లేక టెస్టులు ఆపేశారు. దీంతో గ్రామ యువత ఒక్కటై కరోనా నిధిని ఏర్పాటు చేశారు. చందాలు, విరాళాలు వేసుకుని, అన్ని సదుపాయాలను కల్పిస్తూ కరోనా బాధితులను కాపాడుతున్నారు.జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం సాతారం గ్రామంలో కరోనాతో ముగ్గురు చనిపోయారు. కరోనా బాధితులకు కనీస సౌకర్యాలు లేకపోవడంతో గ్రామంలోని సర్కారు బడిలో ఐసోలేషన్ సెంటర్‌‌‌‌ ప్రారంభించారు. గ్రామంలో వైరస్ కట్టడికి చర్యలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం అక్కడ పాజిటివ్ కేసులు తగ్గుముఖం పట్టాయి.