వీరభైరాన్​పల్లిలో రాపోలు సామూహిక పితృయజ్ఞాన్నిఅడ్డుకున్న యువకులు

వీరభైరాన్​పల్లిలో రాపోలు సామూహిక పితృయజ్ఞాన్నిఅడ్డుకున్న యువకులు
  • భైరాన్​పల్లి చరిత్రను ఇమేజ్​పెంచుకోవడానికి వాడుకుంటున్నారని ఆరోపణ

చేర్యాల, వెలుగు :  సిద్దిపేట జిల్లా దూల్మిట్ట మండలంలోని  వీరభైరాన్​పల్లి గ్రామంలో 75 ఏండ్ల కింద రజాకర్ల దాడులకు బలైన118 మంది అమరవీరులను గుర్తించి మాజీ ఎంపీ రాపోలు ఆనందభాస్కర్​ ఆదివారం నిర్వహించిన సామూహిక పిండప్రదానం, సామూహిక  పితృయజ్ఞాన్ని గ్రామ యువకులు అడ్డుకున్నారు.  అమరుల కుటుంబాలను పిలువకుండా సామూహిక పిండప్రదానంతో పాటుగా పితృ యజ్ఞాన్ని ఎలా చేస్తారని,  ఆనాటి నుంచి నేటి వరకు అమరుల కుటుంబాలకు ఏలాంటి సౌకర్యాలుగాని,  పెన్షన్​గాని ఇవ్వకుండా ఇలాంటి కార్యక్రమాలను ఎలా నిర్వహిస్తారని ఆరోపిస్తూ అడ్డుకునే ప్రయత్నం చేశారు. 

ఈ క్రమంలో చేర్యాల సీఐ పి.సత్యనారాయణరెడ్డితో యువకులు వాగ్వాదానికి దిగారు. ప్రతీ సంవత్సరం భైరాన్​పల్లి చరిత్రను రాజకీయ నాయకులు వాడుకుని వ్యక్తిగత ఇమేజ్​ను పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.  కాగా, ఆనంద భాస్కర్​ పిండప్రదానం, యజ్ఞం కార్యక్రమాలను నిర్వహించి వెళ్లిపోయారు.