ఏపీ శాసనమండలి రద్దు తీర్మానం కూడా వెనక్కి

ఏపీ శాసనమండలి రద్దు తీర్మానం కూడా వెనక్కి

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇవాళ మరో కీలక నిర్ణయం తీసుకుంది. శాసన మండలిని రద్దు చేస్తూ చేసిన తీర్మానాన్ని రద్దు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు శాసనమండలిని రద్దు చేస్తూ 2020 జనవరి 27న చేసిన తీర్మానాన్ని వెనక్కి తీసుకుంటూ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ  తీర్మానించింది. రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి తీర్మానం ప్రవేశపెట్టారు.

మండలి రద్దు నిర్ణయం తర్వాత సందిగ్ధత నెలకొందని, అందుకే సందిగ్ధతను తొలగించేందుకు మండలిని రద్దు చేయాలని తీర్మానం చేసి కేంద్రానికి పంపి 22 నెలలు అయిందని, అప్పటి నుంచి తీర్మానం  నుంచి కేంద్రం వద్దే ఉండిపోయిందని బుగ్గన తెలిపారు. శాసనమండలి రద్దుపై స్పష్ట కోసం గతంలో చేసిన మండలి రద్దు తీర్మానాన్ని రద్దు చేస్తున్నట్లు వివరించారు. ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథరెడ్డి ప్రవేశ పెట్టిన తీర్మానాన్ని సభ ఆమోదించింది.