ఆగస్టు 1 నుంచి థియేటర్స్ ఓపెన్?

ఆగస్టు 1 నుంచి థియేటర్స్ ఓపెన్?

న్యూఢిల్లీ: కరోనా కారణంగా మూతపడిన స్కూల్స్‌‌, మెట్రో సర్వీసులకు అన్‌‌లాక్‌‌3.0లో కూడా పర్మిషన్‌‌ వచ్చేలా లేదు. ఈ నెల 31వ తేదీతో అన్‌‌లాక్‌‌2.0 ముగుస్తుండడంతో ఆగస్టు 1 నుంచి అన్‌‌లాక్‌‌3.0 అమలులోకి రానుంది. గైడ్‌‌లైన్స్‌‌పై ఇప్పటికే కేంద్రం కసరత్తులు చేస్తోంది. 3.0లో లాక్‌‌డౌన్‌‌కు మరిన్ని సడలింపులు ఇస్తారని సమాచారం. సోషల్‌ డిస్టెన్సింగ్‌‌, ఇతర జాగ్రత్తలతో సినిమా హాళ్లు, జిమ్స్‌‌ను ఓపెన్‌‌
చేసుకునేందుకు పర్మిషన్ ‌‌ఇస్తారని తెలుస్తోంది. అయితే స్కూల్స్‌‌, కాలేజీలు ఇతర విద్యాసంస్థలకు, పబ్లిక్‌‌ ఎక్కువగా తిరిగే మెట్రో సర్వీసెస్‌‌కు మాత్రం ఇప్పట్లో పర్మిషన్ ‌‌ఇచ్చే పరిస్థితులు కనిపించడంలేదు. స్కూల్స్ ‌‌రీఓపెన్ ‌చేయడంపై స్కూల్‌ ఎడ్యుకేషన్ ‌‌సెక్రెటరీ అనితా కార్వాల్ ‌‌అధ్యక్షతన జరిగిన మీటింగ్ ‌లో మినిస్ట్రీ ఆఫ్హ్యూమన్ ‌రిసోర్స్ ‌‌డెవలప్‌‌మెంట్‌(హెచ్‌‌ఆర్‌‌‌‌డీ) అన్ని రాష్ట్రాలతో సంప్రదింపులు జరిపింది. స్కూల్స్ ‌‌తెరిచే విషయంలో పేరెంట్స్ ‌‌సానుకూలంగా లేరని హెచ్‌‌ఆర్‌‌‌‌డీ మినిస్టర్‌‌‌‌ రమేశ్ ‌‌పోఖ్రియాల్ ‌చెప్పారు.

సినిమా హాళ్లను తిరిగి ప్రారంభించాలని మినిస్ట్రీ ఆఫ్హోం అఫైర్స్‌‌కు మినిస్ట్రీ ఆఫ్ఇన్ఫర్మేషన్ అండ్ ‌‌బ్రాడ్‌‌కాస్టింగ్‌‌ ప్రతిపాదనలు పంపించింది. ప్రతిపాదనలు పంపడానికి ముందే థియేటర్ల యజమానులతో ఐబీ మినిస్ట్రీమీటింగ్ ‌‌నిర్వహించింది. ఈ మీటింగ్‌‌లో 50% సీటింగ్ ‌‌కెపాసిటీతో థియేటర్లు రీ ఓపెన్ ‌‌చేస్తామని వారు చెప్పగా.. సోషల్ ‌డిస్టెన్సింగ్ ‌రూల్స్ ‌‌పాటిస్తూ ముందు 25% సీటింగ్ ‌కెపాసిటీతో థియేటర్లు తెరవాలని ఐబీ మినిస్ట్రీ సూచించినట్లు తెలిసింది. అయితే, కరోనా వ్యాప్తి, అక్కడి పరిస్థితుల ప్రకారం ఆయా రాష్ట్రాలు సొంత గైడ్‌‌లైన్స్ ‌ఏర్పాటు చేసుకునే వెసులుబాటును కేంద్రం ఇవ్వనుందని సమాచారం.

మ‌రిన్ని వార్త‌ల కోసం