ఖానాపూర్లో మూడు ఆలయాల్లో చోరీ

ఖానాపూర్లో మూడు ఆలయాల్లో చోరీ

ఖానాపూర్, వెలుగు: ఖానాపూర్ పట్టణం శివారు ప్రాంతంలోని పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయంలో ఆదివారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. ఆలయ తలుపులను పగులగొట్టి లోపలికి వెళ్లి గాయత్రి మాత ఈశ్వరి దేవి మీద ఉన్న పుస్తెలు, హుండీని పగులగొట్టి  ఆభరణాలు, నగదు ఎత్తుకెళ్లారని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. 

మండలంలోని తర్లపాడులో ఉన్న అగ్గి మల్లన్న, ఓంకారేశ్వర ఆలయాల్లోనూ దొంగలు చొరబడి నగదు, వస్తువులను ఎత్తుకెళ్లారు. ఆయా ఆలయాల్లో ఉన్న సీసీ కెమెరాలను ధ్వంసం చేశారు. సీసీ ఫుటేజీల డీవీఆర్ రూటర్లను ఎత్తుకెళ్లారు. ఒకే రోజు రాత్రి మూడు ఆలయాల్లో చోరీ జరగడం స్థానికంగా చర్చనీయాంశమైంది. కేసులు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.