కొండగట్టు అంజన్న గుడిలో చోరీ.. ఆలయం మూసివేత

కొండగట్టు అంజన్న గుడిలో చోరీ.. ఆలయం మూసివేత

జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయ స్వామి  ఆలయంలో దొంగలు పడ్డారు.  ప్రధాన ఆలయంలోని రెండు విగ్రహాలు చోరి చేశారు. 2 కిలోల స్వామి మకరతోరణం, అర్థమండపంలోని ఆంజనేయ స్వామి వారి వెండి తోరణం  ఎత్తుకెళ్లారు. ఇది ఐదు కిలోల వరకు ఉంటుంది. 3 కిలోల శఠగోపాలు ఎత్తుకెళ్లారు.  మొత్తం 15 కిలోల వరకు ఆభరణాలు ఎత్తుకెళ్లారు. వీటి విలువు సుమారు రూ. 9 లక్షల వరకు ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. ఆలయ అధికారుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.

ఇవాళ ఉదయం సుప్రభాత సేవ చేసేందుకు గుడికి వెళ్లిన అర్చకులు ప్రధాన ద్వారం నుంచి దొంగలు పడ్డట్లు గుర్తించారు. వెంటనే ఈ విషయాన్ని పోలీసులకు చెప్పారు. దీంతో ఆలయాన్ని మూసేసిన అధికారులు విచారణ జరుపుతున్నారు. పోలీసులు  సీసీటీవీ ఫుటేజీ పరిశీలిస్తున్నారు. డాగ్‌  స్క్వాడ్‌తో సోదాలు ప్రారంభించారు. స్పెషల్‌ టీమ్స్‌ ఫింగర్‌ ప్రింట్స్‌ సేకరించే పనిలో పడ్డాయి. ఆలయం మూసివేయడంతో భక్తులు ఇబ్బందిపడుతున్నారు. 

కొండగట్టుతో పాటు ధర్మపురి మండలం రాయపట్నం లోని శివాలయంలో దుండగులు హుండీ పగలగొట్టి డబ్బులు ఎత్తుకెళ్లారు.   జగిత్యాల రూరల్ మండలంలోని పొలాస గ్రామంలో  పౌలేశ్వర స్వామి ఆలయ కార్యాలయంలోని బీరువాను పగలగొట్టారు.