చేగుంటలో రూ.11 లక్షలు చోరీ

చేగుంటలో రూ.11 లక్షలు చోరీ

మెదక్ (చేగుంట), వెలుగు: మండల కేంద్రమైన చేగుంటలో భారీ చోరి జరిగింది. రాము అనే వ్యక్తి ఇటీవల తన వ్యవసాయ భూమి అమ్మగా వచ్చిన  రూ.11 లక్షలను ఇంట్లో బీరువాలో పెట్టి  సోమవారం రాత్రి స్థానిక సీఎంఆర్ కాలనీలో కొత్తగా నిర్మిస్తున్న ఇంటి వద్ద సిమెంట్​బస్తాలకు కాపలాగా పడుకొన్నాడు.  మక్కరాజ్ పేటలో బంధువుల ఇంట్లో శుభకార్యానికి వెళ్లిన భార్య వజ్రమణి మంగళవారం ఉదయం 6 గంటలకు ఇంటికి రాగా తాళాలు పగలగొట్టి ఉన్నాయి. ఇంట్లోకి వెళ్లి చూడగా బీరువాలో దాచి పెట్టిన రూ. 11 లక్షలు మాయమైనట్టు గ్రహించి భర్త రాముకి ఫోన్ చేసి చెప్పింది. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయగాడీఎస్పీ వెంకట్​రెడ్డి,  సీఐ వెంకటేశ్, చేగుంట ఎస్ఐ బాల్​రాజ్​ వచ్చి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. క్లూస్​ టీం ఆధారాలు సేకరించింది.  కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.