ఎయిర్​పోర్టులు, ఫ్లైట్లలో చోరీలు

ఎయిర్​పోర్టులు, ఫ్లైట్లలో చోరీలు
  • న్యూఢిల్లీకి చెందిన వ్యక్తి అరెస్ట్

శంషాబాద్, వెలుగు : ఎయిర్​పోర్టులు, ఫ్లైట్లలో ప్రయాణికుల దృష్టి మరల్చి చోరీలకు పాల్పడుతున్న వ్యక్తిని శంషాబాద్​ఎయిర్​పోర్టు పోలీసులు అరెస్ట్​చేశారు. డీసీపీ నారాయణరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. న్యూఢిల్లీలోని పహాడ్ గంజ్​కు చెందిన రాజేశ్​కపూర్ ఇప్పటివరకు 200 సార్లు ఫ్లైట్​జర్నీ చేశాడు. ప్రధానంగా ఢిల్లీ నుంచి చండీగఢ్, అమృత్ సర్, ముంబై, చెన్నై, హైదరాబాద్​జర్నీ చేశాడు.

తోటి ప్రయాణికులతో ఫ్రెండ్లీగా మాట్లాడుతూ బంగారం, డబ్బు కొట్టేసేవాడు. రాజేశ్​కపూర్​పై ఇప్పటివరకు శంషాబాద్ ఎయిర్ పోర్ట్ పోలీస్ స్టేషన్ 5 చోరీ కేసులు నమోదయ్యాయి. ఇతర రాష్ట్రాల్లో మరో 5 కేసులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.