క్రెడిట్ ​కార్డు ట్రాన్సాక్షన్లపై రహస్య​ చార్జీలు ఉంటాయ్​

క్రెడిట్ ​కార్డు ట్రాన్సాక్షన్లపై రహస్య​ చార్జీలు ఉంటాయ్​

వెలుగు, బిజినెస్: చేతిలో డబ్బు లేనప్పుడు, షాపింగ్​ వంటి కొన్ని ప్రత్యేక సందర్భాల్లో క్రెడిట్ కార్డ్‌‌‌‌‌‌‌‌లు చాలా ఉపయోగపడుతాయి. కొనుగోళ్లు చేయడానికి,  రివార్డ్‌‌‌‌‌‌‌‌లను సంపాదించడానికి ఇవి పనికి వస్తాయి.  క్రెడిట్ కార్డ్​తో ఎన్నో లాభాలు ఉన్నప్పటికీ వీటి వాడకంపై కొన్ని పరిమితులు ఉంటాయనే విషయాన్ని తప్పక గుర్తుంచుకోవాలి. ‘ క్రెడిట్ కార్డ్‌‌‌‌‌‌‌‌లు ఉచితం’ అని బ్యాంక్  క్లెయిమ్ చేసినప్పటికీ,  కొన్ని హిడెన్​ చార్జీలు (రహస్య చార్జీలు) ఉంటాయని కన్జూమర్లు అర్థం చేసుకోవాలి.

1) మెయింటెనెన్స్ చార్జ్

 క్రెడిట్ కార్డ్‌‌‌‌‌‌‌‌ని ఉపయోగిస్తున్నప్పుడు రహస్య చార్జీలు  పడే  అవకాశాలు ఉంటాయి. అయినప్పటికీ ఆందోళన పడాల్సిన అవసరం లేదు.  అందరికీ అన్ని చార్జీలూ వర్తించవు.  సర్వసాధారణంగా ఎక్కువ రికార్డు పాయింట్లు, యాన్యువల్ చార్జ్​లతో కూడిన హై- ఎండ్ రివార్డ్ క్రెడిట్ కార్డ్‌‌‌‌‌‌‌‌లకు వీటి బెడద అధికంగా ఉంటుందని ఎస్​ఏజీ ఇన్ఫోటెక్ ఎండీ అమిత్ గుప్తా అన్నారు. మై ఫండ్​​ బజార్​  ఫౌండర్​ వినిత్ ఖండారే మాట్లాడుతూ, సాధారణంగా మొదటి 365 రోజులకు మాత్రమే జాయింట్​ ఫీజు, యాన్యువల్​ చార్జెస్​ ఉండబోవని, ఆ తర్వాత నుంచి వీటిని వసూలు చేస్తారని స్పష్టం చేశారు. కార్డు తీసుకునే ముందే ఇలాంటివన్నీ కనుక్కోవాలని, ‘లైఫ్​టైం ఫ్రీ’ కార్డులను ఎంచుకోవాలని వివరించారు. 

2) క్యాష్​ అడ్వాన్స్ ఫీజు

  ఏటీఎం నుంచి డబ్బు విత్‌‌‌‌‌‌‌‌డ్రా చేసుకోవడానికి   క్రెడిట్ కార్డ్‌‌‌‌‌‌‌‌ని ఉపయోగించవచ్చు. అయితే, మీ క్రెడిట్ కార్డ్ రూల్స్​ప్రకారం ముందస్తు చార్జ్​ వసూలు చేస్తారు.  క్రెడిట్ కార్డ్ నుంచి నగదు విత్​డ్రా చేసుకోకపోవడమే మంచిదని, ఇందుకు చాలా మొత్తంలో వడ్డీ వేస్తారని ఎక్స్​పర్టులు చెబుతున్నారు. సాధారణంగా చాలా సంస్థలు  2.5 శాతం వరకు వడ్డీ వసూలు చేస్తున్నాయి. 

3) ఆలస్యంగా చెల్లింపు చార్జ్

ఆలస్యంగా క్రెడిట్​కార్డు బిల్లు చెల్లించినా జరిమానాలు పడతాయి. మినిమం అమౌంట్​ (కనీస బిల్లు) కట్టకున్నా, ఆలస్యంగా చెల్లించినా ఫైన్లు తప్పవు. "క్రెడిట్ కార్డ్ హోల్డర్లు కనీస బకాయి మొత్తాన్ని సకాలంలో చెల్లించకున్నా,  ఆలస్యంగా చెల్లించినా క్రెడిట్ స్కోర్‌‌‌‌‌‌‌‌ దెబ్బతింటుంది. అంతేగాక బ్యాంకులు ఫ్లాట్ ఫీజును వసూలు చేస్తాయి.  కనీస బకాయి మొత్తాన్ని చెల్లించినంత మాత్రాన వడ్డీ నుంచి తప్పించుకోలేం" అని వినిత్ ఖండారే చెప్పారు. అంతేగాక అన్ని క్రెడిట్ కార్డ్ ట్రాన్సాక్షన్లకు జీఎస్టీ వర్తిస్తుంది. క్రెడిట్ కార్డ్ ఫీజులో 18 శాతం వరకు వసూలు చేస్తారు.

4) విదేశీ ట్రాన్సాక్షన్లు

మెజారిటీ  ప్రొLవైడర్లు ఇచ్చే  క్రెడిట్ కార్డ్ లు దాదాపు ప్రపంచవ్యాప్తంగా చెల్లుబాటు అవుతాయి. విదేశీ ట్రాన్సాక్షన్లపై అదనపు చార్జ్​లను వేస్తారు. ట్రాన్సాక్షన్లు జరిపిన మొత్తంలో కొంత శాతాన్ని రూపాయలుగా మార్చుకుని చార్జ్​గా విధిస్తారు. ఈ మొత్తం దాదాపు మూడు శాతం వరకు ఉంటుంది.  మీరు  క్రెడిట్ కార్డులోని బ్యాలెన్స్​ను వేరే కార్డులోకి ట్రాన్స్​ఫర్​ చేయాలన్నా ప్రత్యేకంగా చార్జీని చెల్లించాలి. సాధారణంగా,   బదిలీ చేసే డబ్బులో కొంత భాగం ఖర్చవుతుంది అని వినీత్ ఖండారే చెప్పారు.  రహస్య చార్జీలను నివారించడానికి క్రెడిట్ కార్డ్‌‌‌‌‌‌‌‌ను ఎంచుకునే ముందే ఫీజులు  చార్జీలను తప్పకుండా చదివి అర్థం చేసుకోవాలని సలహా ఇచ్చారు.