
భారత స్టాక్ మార్కెట్లు గురువారం అనుహ్యంగా భారీ ర్యాలీని చూస్తున్నాయి. మధ్యాహ్నం సెషన్ సమయానికి సూచీలు భారీ లాభాల్లో కొనసాగుతున్నాయి. మధ్యాహ్నం 3 గంటల సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 1000 పాయింట్ల లాభంతో ఉండగా మరో కీలక సూచీ నిఫ్టీ 300 పాయింట్ల మేర లాభంలో ఉంది. ఇదే క్రమంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ 675 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 330కి పైగా పాయింట్లు పెరిగి దూసుకుపోతోంది. ఈ క్రమంలో మార్కెట్లు లాభాల్లో దూసుకుపోవటానికి అసలు కారణాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
* ముందుగా బ్యాంకింగ్ షేర్లు మార్కెట్ పెరుగుదలకి కారణంగా నిలిచాయి. బాంక్ నిఫ్టీ గత సెషన్ లో ఉన్న నష్టాల నుంచి సగటున అర శాతం పైగా పెరిగింది. ముఖ్యంగా యాక్సిస్ బ్యాంక్, AU స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ వంటి కంపెనీల షేర్లపై బలమైన కొనుగోళ్లు కనబడ్డాయి. యాక్సిస్ బ్యాంక్ రిపోర్టులో సెప్టెంబర్ త్రైమాసికంలో మంచి రుణ వృద్ధి కారణంగా షేర్ ధర పెరిగింది. ప్రభుత్వ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల విలీనంపై ఇన్వెస్టర్ల దృష్టి కొనసాగుతోంది.
* నేడు విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లతో పాటు దేశీయ ఇన్టిట్యూషనల్ భయ్యర్స్ భారీగా మార్కెట్లో షేర్లు కొన్నాయి. దీంతో మార్కెట్లో లిక్విడిటీ మెరుగుపడింది.
* ఆసియా మార్కెట్లలో మంచి ట్రేడింగ్ కనిపించింది. వాల్ స్ట్రీట్ గెయిన్స్ భారత మార్కెట్లలో కూడా బుల్ జోరును ప్రేరేపించింది. దాంతో భారత స్టాక్ మార్కెట్ కూడా మంచి వృద్ధిని చూపింది.
* ఇండియా-అమెరికా ట్రేడ్ చర్చలు మంచి ఫలితాలు ఇస్తాయని ఆశలతో ఇన్వెస్టర్లలో పాజిటివ్ సెంటిమెంట్లు మెరుగుపడ్డాయి. ప్రత్యేకంగా ఎనర్జీ ట్రేడ్ గురించి భారత ప్రభుత్వ వర్గాల నుంచి వస్తున్న కామెంట్స్ త్వరలోనే సమస్యలు పరిష్కారం అవుతాయనే నమ్మకాన్ని కలిగిస్తున్నాయి.
* ఇక చివరిగా రూపాయి అమెరికన్ డాలర్ మారకపు విలువ పెరిగింది. కేంద్ర బ్యాంక్ జోక్యం, దిగువనున్న క్రూడ్ ధరల కారణంగా రూపాయి బలపడిందని నిపుణులు చెబుతున్నారు.