ఇప్పట్లో కరోనా తగ్గే అవకాశాల్లేవు: డేవిడ్

ఇప్పట్లో కరోనా తగ్గే అవకాశాల్లేవు: డేవిడ్

కరోనా వైరస్ ను కట్టడి చేసేందుకు వ్యాక్సిన్ వచ్చే వరకు ప్రమాదం మనల్ని వెన్నంటే ఉంటుందన్న నిజాన్ని తెలుసుకోవాలన్నారు ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) అధికార ప్రతినిధి డేవిడ్ నాబర్రో. ఈ వైరస్ తగ్గినట్టే తగ్గి మళ్లీ విజృంభిస్తుందని, ఈ ముప్పు నుంచి ప్రపంచం ఇప్పట్లో బయటపడే అవకాశాల్లేవని తేల్చిచెప్పారు.

వైరస్ ఉనికిని ఎప్పటికప్పుడు గుర్తించడం, పాజిటివ్ వచ్చిన ఐసోలేషన్ లో ఉంచడం అనే ప్రక్రియను నిరంతరం కొనసాగించడమే ప్రస్తుతానికి దీన్ని ఎదుర్కొనేందుకు ఉన్న ఏకైక మార్గమన్నారు నాబర్రో. వ్యాక్సిన్ వచ్చేంతవరకు ప్రపంచ దేశాలన్నీ ఈ విధానాన్ని పాటించక తప్పదన్నారు. అనేక దేశాల్లో ప్రజలను ఇళ్లకే పరిమితం చేస్తూ లాక్ డౌన్ ఆంక్షలు విధించారని, ఇప్పుడా ఆంక్షలను సడలించడం అంటే వైరస్ వ్యాప్తికి మరింత అవకాశమిచ్చినట్టేనని… ఈ విషయంపై ఆయా దేశాలు మరోసారి ఆలోచించుకోవాలని సూచించారు.