విద్యుత్‌‌‌‌ శాఖలో పరికరాల కొరత

విద్యుత్‌‌‌‌ శాఖలో పరికరాల కొరత
  • దాదాపు 30 రకాల పరికరాలు అందుబాటులో ఉండట్లే 
  • ట్రాన్స్‌‌ఫార్మర్ల ఆన్‌‌ఆఫ్‌‌కు వాడే ఏబీ స్విచ్‌‌లు లేక తరచూ ఇబ్బందులు

మహబూబ్​నగర్​, వెలుగు : విద్యుత్‌‌‌‌ శాఖలో పరికరాల కొరత ఏర్పడింది. ట్రాన్స్ కో ఆఫీసుల్లోని స్టోర్లలో దాదాపు 30 రకాల మెటీరియల్​ అందుబాటులో ఉండడం లేదు.  ట్రాన్స్‌‌‌‌ఫార్మర్ల ఆన్‌‌‌‌ఆఫ్‌‌‌‌కు వాడే ఏబీ స్వీచ్‌‌‌‌లు, హెచ్​జీ ఫ్యూజ్ సెట్ల స్టాక్,  వైరు కూడా అరకొరగానే ఇస్తున్నారని రైతులు వాపోతున్నారు. ఏబీ స్వీచ్‌‌‌‌లు లేకపోవడంతో ట్రాన్స్‌‌ఫార్మర్ల వద్ద సమస్య ఏర్పడితే ఫీడర్‌‌‌‌‌‌‌‌ పరిధిలోని అన్ని గ్రామాలకు కరెంట్‌‌‌‌ కట్‌‌‌‌ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.   కాగా,  ఐరన్‌‌‌‌ రేట్‌‌‌‌ పెరగడంతో కాంట్రాక్టర్లు సఫ్లై తగ్గించడమే ఇందుకు కారణమని తెలుస్తోంది. 

2021 నుంచి ఇబ్బందులు 

80 రకాల మెటీరియల్‌‌‌‌ సప్లై చేసేందుకు ట్రాన్స్​కో 2018లో టెండర్ల ద్వారా కొన్ని కంపెనీలతో కాంట్రాక్ట్​ కుదుర్చుకుంది. 2020 వరకు అంతరాయం లేకుండా సఫ్లై చేసినా.. 2021 నుంచి కంపెనీలు ముందుకు రావడం లేదు.  మార్కెట్‌‌‌‌లో ఐరన్ రేట్లు విపరీతంగా పెరగడంతో ప్రస్తుతం ఇస్తున్న రేట్​కు అదనంగా ఇవ్వాలని డిమాండ్​ చేస్తున్నాయి. ఇందుకు ట్రాన్స్‌‌‌‌ కో ఒప్పుకోకపోవడంతో ఏడాదిన్నరగా సఫ్లైని తగ్గించాయి.  దీంతో ట్రాన్స్​ఫార్మర్లను ఆన్‌‌‌‌ఆఫ్‌‌‌‌ చేసే ఏబీ స్విచ్‌‌‌‌లు, హెచ్​జీ ఫ్యూజ్​సెట్ల స్టాక్​ సరిపడా ఉండడం లేదు.  11 కేవీ పిన్​ ఇన్సులేటర్స్, జీఐ ఎర్త్​పైపుల సప్లై కూడా తగ్గిపోయింది.  ఇవి లేకుండా డీటీఆర్​ (ట్రాన్స్​ఫార్మర్లు) చార్జ్​ చేయలేని పరిస్థితి ఏర్పడుతోంది.  ఒక్కో ట్రాన్స్​ఫార్మర్​ కోసం ఎల్టీ వైర్ ఆరు నుంచి ఏడు కిలోమీటర్లు అవసరం ఉండగా, కేవలం మూడు కిలోమీటర్ల వైర్​నే ఇస్తున్నారు.   

నెట్ క్యాష్​ ఇచ్చినోళ్లకే ట్రాన్స్​ఫార్మర్లు

అగ్రికల్చర్, గ్రామాల్లో అవసరాల కోసం ట్రాన్స్​ఫార్మర్లు ఇవ్వడం లేదు. రైతుల డిమాండ్‌‌‌‌ మేరకు ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలోని 72 మండలాలకు ఒక్కో మండలానికి పది ట్రాన్స్​ఫార్మర్ల చొప్పున 720 ట్రాన్స్​ఫార్మర్ల అవసరం ఉందని కాంట్రాక్టర్లు అడుగుతున్నారు.  కానీ, ఒక్కో మండలానికి కేవలం రెండు, మూడు మాత్రమే ఇచ్చి సరి పెడుతున్నారు. స్టోర్​లో  25 కేవీ, 60 కేవీ ట్రాన్స్​ఫార్మర్లు 50 నుంచి 60 వరకు అందుబాటులో ఉన్నా  ఫుల్​ పేమెంట్​ చేస్తున్న కంపెనీలకే వీటిని ఇస్తున్నారు.   

బిల్లులు పెండింగ్​

ఉమ్మడి జిల్లాలో 72 మండలాలు ఉండగా, ఒక్కో మండలంలో ఐదారుగురు ట్రాన్స్​కో కాంట్రాక్టర్లు ఉన్నారు. 2021 వరకు వీరు ట్రాన్స్​ఫార్మర్లు, ఇతర సామగ్రిని ఏర్పాటు చేశారు.  ఏబీ స్విచ్‌‌‌‌లు సఫ్లై తగ్గిపోవడంతో చాలా పనులు పెండింగ్‌‌‌‌లో ఉన్నాయి.  దీంతో బిల్లులు డ్రా చేసుకుందామన్నా పనులు ఇన్​ కంప్లీట్‌‌‌‌గా ఉండటంతో శాంక్షన్​ చేయని పరిస్థితి ఏర్పడింది. స్విచ్‌‌‌‌లు సప్లై చేయాలని, పెండింగ్‌‌‌‌ బిల్లులు ఇవ్వాలని కాంట్రాక్టర్లు తరచూ మహబూబ్​నగర్​ ట్రాన్స్​కో చుట్టూ తిరుగుతున్నారు.   

మహబూబ్​నగర్ ​నుంచి వనపర్తికి డైవర్షన్​

మహబూబ్​నగర్​ స్టోర్స్​ పరిధిలో పాలమూరులోని 16 మండలాలు, నాగర్​కర్నూల్​లోని 2‌‌‌‌‌‌‌‌0, నారాయణపేటలోని 11 మండలాలు వస్తాయి.  ఇక్కడి ఐదు విద్యత్​ డివిజన్​ల పరిధిలోని ఒక్కో మండలానికి ప్రస్తుతం 30 నుంచి 40 టీటీ ఏబీ స్విచ్​లు అవసరం ఉన్నాయి.  200 ఏబీ స్విచ్‌‌‌‌లు పాలమూరు జిల్లా స్టోర్‌‌‌‌‌‌‌‌కు స్టాక్​ రాగా.. ఇందులో 100 వనపర్తి స్టోర్స్​కు డైవర్షన్​ చేస్తున్నట్లు తెలిసింది.  వనపర్తి స్టోర్స్​ నుంచి ఆ స్టోర్​ పరిధిలోని ఉన్న గద్వాల డివిజన్​కు కొన్నింటిని డైవర్షన్​ చేయాల్సి ఉంది. అయితే, పాలమూరుకు వచ్చిన ఏబీ స్విచ్​ల రా మెటీరియల్​ను ఇంకా ఫిట్​ చేయలేదు. వీటికి సంబంధించిన నట్లు, బోట్లు ఇంకా సరఫరా కాలేదు. వీటిని ఫిట్​ చేయడానికి ఇంత వరకు హైదరాబాద్​ నుంచి సఫ్లై కంపెనీ వర్కర్లు రాలేదు. 

ఆన్‌ఆఫ్‌ స్విచ్‌లు లేవు

ట్రాన్స్​ఫార్మర్లకు ఆన్​ఆఫ్  స్విచ్​లు లేవు. కరెంట్ ఆఫీసర్లకు అడిగితే డిపార్ట్​మెంట్​ నుంచి రావడం లేదని చెబుతున్నరు. గ్రామంలో చిన్న సమస్య వచ్చినా ఊరంతా కరెంట్ కట్​ చేస్తున్నరు. ఎల్​సీ తీసుకోవాలన్నా సమస్య ఏర్పడుతోంది. ​ 

- గోపాల్​, సర్పంచ్​, అసిరెడ్డిపల్లి

ఓవర్​ లోడ్​తో సమస్యలు

ఓవర్​ లోడ్​తో సమస్యలు వస్తున్నయి. ఇంతకు ముందు ఒక ట్రాన్స్​ఫార్మర్​ కింద మూడు బోర్లు ఉండేవి. ఇప్పుడు 25 మోటార్లు ఉంటున్నయి. రైతులకు ఎక్స్​ట్రా ట్రాన్స్​ఫార్మర్లు కావాలని ఇటీవల జడ్పీలో ఆఫీసర్లను కోరినం. అలాగే ఎల్​సీ తీసుకునేటప్పుడు ఒక రైతుకు సమస్య ఉంటే, మొత్తం ఊరంతా కరెంటు తీస్తున్నరు. - ఎం.రవీందర్​రెడ్డి, జడ్పీటీసీ, నవాబ్​పేట