ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా సంక్షిప్త వార్తలు

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా సంక్షిప్త వార్తలు

అడ్డాకుల, వెలుగు: డ్యూటీ డుమ్మా కొడితే ఊరుకునేది లేదని కలెక్టర్ వెంకట్‌‌రావు హెచ్చరించారు. సోమవారం  మూసాపేట మండలం జానంపేట పీహెచ్‌‌సీని ఆకస్మికంగా తనిఖీ చేశారు.  సిబ్బంది అటెండెన్స్‌‌ రిజిస్టర్‌‌‌‌ను పరిశీలించి డ్యూటీలో ఉన్న సిబ్బందిపై ఆరా తీశారు.  జూనియర్ అసిస్టెంట్ శ్రీనివాస్ గౌడ్,  ఆఫీస్ సబార్డినేటర్లు రహీమ్, శ్రీనివాసులు  అనుమతి లేకుండా విధులకు డుమ్మా కొట్టడం గుర్తించిన ఆయన సస్పెండ్ చేశారు. అలాగే  సీహెచ్‌‌వో జయ పాల్ , హెచ్‌‌సీ సువర్ణల షోకాజ్ నోటీసులు జారీ చేశారు. డీఎంహెచ్‌‌వోతో ఫోన్లో మాట్లాడుతూ ఆస్పత్రి సిబ్బంది డ్యూటీకి రావడం లేదని వెంటనే  నివేదిక సమర్పించాలని ఆదేశించారు. అలాగే గ్రామంలో ప్లే గ్రౌండ్‌‌ను పరిశీలించిన ఆయన పనులు పూర్తికాకపోవడంపై తహసీల్దార్‌‌‌‌ మంజుల, ఎంపీడీవో స్వరూపపై  ఆగ్రహం వ్యక్తం చేశారు.  గ్రామ శివారులోని గంగారం చెరువు అలుగును కొందరు వ్యక్తులు ధ్వసం చేయడంతో నీరంతా తాళ్లగడ్డ రోడ్డుపైకి వస్తోందని గ్రామస్తులు కలెక్టర్ దృష్టికి తెచ్చారు. స్పందించిన ఆయన ఇరిగేషన్ అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కరించాలని ఆదేశించారు. అంతకుముందు మూసాపేట తహసీల్దార్‌‌‌‌ ఆఫీస్‌‌ను సందర్శించి  ధరణి  రికార్డులను పరిశీలించారు.  

పత్తి కొనుగోళ్లకు ఏర్పాట్లు చేయండి

నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు:  పత్తి కొనుగోళ్ల కోసం అన్ని ఏర్పాట్లు చేయాలని  కలెక్టర్ ఉదయ్ కుమార్ ఆదేశించారు. సోమవారం కలెక్టర్‌‌‌‌‌‌‌‌ క్యాంపు ఆఫీసులో అడిషనల్‌‌‌‌ కలెక్టర్ మోతిలాల్‌‌‌‌తో కలిసి సీసీఐ, మార్కెటింగ్, అగ్నిమాపక, అగ్రికల్చర్‌‌‌‌‌‌‌‌ అధికారులు, జిన్నింగ్ మిల్లుల యజమానులతో  మీటింగ్ పెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  ప్రస్తుతం క్వింటాల్‌‌‌‌ పత్తికి బయటి మార్కెట్‌‌‌‌లో  రూ. 6,382  నుంచి రూ. 7,500  వరకు ధర పలుకుతోందన్నారు. రైతులకు గిట్టుబాటు ధర రాకుంటే ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధర రూ.6,382 చెల్లించి కొనాలని సూచించారు. ఇదివరకే నిర్ణయించిన  ట్రాన్స్‌‌‌‌ఫోర్డ్‌‌‌‌ రేట్లను పరిగణలోకి తీసుకోవాలని, జిన్నింగ్ మిల్లుల వద్ద రైతులకు అన్ని వసతులు కల్పించాలని ఆదేశించారు.  అగ్ని మాపక శాఖ అధికారులు జిన్నింగ్ మిల్లులను తనిఖీ చేసి  ప్రమాదాలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. తూనికలు, కొలతలు శాఖ అధికారులు వేబ్రిడ్జిలను చెక్‌‌‌‌ చేయాలన్నారు.  జిల్లాలో 3 .31 లక్షల ఎకరాల్లో పత్తి సాగైందని, 3 .97 లక్షల క్వింటాళ్ల  దిగుబడి రానున్నట్లు వ్యవసాయ శాఖ అంచనా వేసిందన్నారు.  రైతులు తేమశాతం తక్కువగా ఉండేలా చూసుకొని అమ్మకానికి తీసుకురావాలని సూచించారు. అనంతరం పత్తి మద్దతు ధర, కొనుగోళ్లపై రూపొందించిన వాల్‌‌‌‌ పోస్టర్‌‌‌‌‌‌‌‌ను ఆవిష్కరించారు.  మార్కెటింగ్ అధికారి బాలమణి, జిల్లా వ్యవసాయ  అధికారి వెంకటేశ్వర్లు, అగ్నిమాపక శాఖ అధికారి కృష్ణమూర్తి,  సీసీఐ మేనేజర్లు, వరుణ్, వెంకటేశ్వర్లు, చంద్రశేఖర్  పాల్గొన్నారు. 

అంగన్‌‌ వాడీల్లో 100 శాతం అటెండెన్స్‌‌ ఉండాలి

నారాయణపేట, వెలుగు: అంగన్‌‌వాడీ సెంటర్లకు పిల్లలందరూ వచ్చేలా టీచర్లు, అధికారులు చర్యలు తీసుకోవాని కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు.  సోమవారం కలెక్టరేట్ మీటింగ్‌‌ హాల్‌‌లో  స్త్రీ,శిశు సంక్షేమ శాఖ పనితీరుపై సమీక్ష నిర్వహించారు.  ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అంగన్‌‌వాడీ సెంటర్లలో  పిల్లల సంఖ్య చాలా తక్కువ ఉంటోందని, 15 రోజుల్లో ఈ పరిస్థితి  మారాలన్నారు. 95 నుంచి 100 శాతం పిల్లలు హాజరు కావాలని సూచించారు.  తర్వాత తాను ర్యాండమ్‌‌గా చెక్ చేస్తానని,  తేడాలు ఉంటే చర్యలు తప్పవని హెచ్చరించారు.  ఎత్తులు, బరువు  సరిగ్గా లేని స్యామ్ మ్యామ్‌‌ పిల్లల విషయంలో ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని, తప్పుడు లెక్కలు నమోదు చేస్తే ఊరుకునేది లేదన్నారు.  వీరికి కావాల్సిన పౌష్టికాహారం,  వైద్యం అందించి సాధారణ స్థితికి తేవాలని సూచించారు.  సూపర్వైజర్లు  తప్పనిసరిగా ప్రతిరోజూ సెంటర్లను సందర్శించి  పరిశుభ్రతపై ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.  చైల్డ్ లైన్ ప్రొటెక్షన్ సమీక్షలో మాట్లాడుతూ అనాథ పిల్లలను   గురుకులాలు, కేజీబీవీల్లో  చేర్చించాలని, బడిబయటి  పిల్లలను గుర్తించి స్కూళ్లలో చేర్పించాలని ఎంఈవోలు, హెచ్‌‌ఎంలను ఆదేశించారు. జిల్లా సంక్షేమ అధికారి వేణుగోపాల్, డీసీపీవో కుసుమలత, సీడీపీవోలు, సూపర్‌‌‌‌వైజర్లు  పాల్గొన్నారు.

ఫిర్యాదుల పరిష్కారంలో జాప్యం వద్దు

మహబూబ్ నగర్ కలెక్టరేట్, వెలుగు:  ప్రజావాణి ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని  కలెక్టర్ ఎస్. వెంకట్‌‌రావు అధికారులను ఆదేశించారు.  సోమవారం  రెవెన్యూ మీటింగ్ హాల్‌‌లో  ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించి.. ఆయా శాఖలకు పంపించారు.   అనంతరం మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో  పత్తి పంట నాణ్యత ప్రమాణాలు, మద్దతు ధరపై రూపొందించిన వాల్‌‌ పోస్టర్‌‌‌‌ను ఆవిష్కరించారు. అలాగే తెలుగు సాహిత్యంలో గోల్డ్‌‌ మెడల్ సాధించిన జిల్లాకు చెందిన దివ్యాంగుడు హరీశ్ కుమార్‌‌‌‌ను శాలువా, జ్ఞాపికతో సత్కరించారు.  అడిషనల్ కలెక్టర్లు తేజస్ నందలాల్ పవార్, సీతారామారావు, స్పెషల్ కలెక్టర్ పద్మశ్రీ, ఆర్డీవో అనిల్ కుమార్, జడ్పీ సీఈవో జ్యోతి, జిల్లా అధికారులు పాల్గొన్నారు.

ప్రమాదాల నివారణకు బారికేడ్లు

మదనాపురం, వెలుగు : మదనాపురం మండల కేంద్రంలోని రైల్వే గేటు సమీపంలో సరళాసాగర్ రోడ్డుబ్రిడ్జిపై ప్రమాదాలు నివారించేందు  బారికేడ్లు ఏర్పాటు చేస్తున్నామని  ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి చెప్పారు. సోమవారం ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ బ్రిడ్జిపై బారికేడ్లు, రేయిలింగ్ కోసం ఎమ్మెల్యే, కలెక్టర్ నిధుల నుంచి రూ.13 లక్షలు కేటాయించినట్టు తెలిపారు.  ముందు ఎడమవైపు పూర్తిచేసిన తర్వాత కుడివైపు పనులు చేపట్టాలని అధికారులకు సూచించారు. కొత్త బ్రిడ్జి నిర్మాణానికి త్వరలోనే టెండర్లు పిలిచి పనులను ప్రారంభిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో  టీఆర్‌‌‌‌ఎస్‌‌ మండల అధ్యక్షుడు యాదగిరి, సింగిల్ విండో అధ్యక్షుడు వంశీ చందర్ రెడ్డి, నేతలు వెంకట్ నారాయణ, గోపి స్వామి, చాంద్ పాషా, నాగన్న యాదవ్, బాలకృష్ణ పాల్గొన్నారు.

లక్ష్మారెడ్డిపై వ్యక్తిగత ఆరోపణలు చేస్తే సహించం

 

జడ్చర్ల, వెలుగు: జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డిపై వ్యక్తిగత  ఆరోపణలు చేస్తే సహించేది లేదని రాష్ట్ర సర్పంచుల సంఘం ప్రధాన కార్యదర్శి ప్రణీల్​ చందర్​ హెచ్చరించారు.  సోమవారం జడ్చర్ల-–కల్వకుర్తి హైవే పక్కన ఉన్న వంద పడకల ఆస్పత్రి వద్ద ప్రెస్‌‌ మీట్ పెట్టి మాట్లాడారు.  రూ.20 కోట్లు మంజూరు చేయించి ఆస్పత్రిని నిర్మించిన ఎమ్మెల్యేపై టీపీసీసీ సెక్రటరీ  అనిరుధ్​రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేయడం ఏంటని మండిపడ్డారు.  కాంపౌండ్​ వాల్​,  సీసీ రోడ్లు, డైనింగ్​ హాల్​, కిచెన్​, అప్రోచ్​ రోడ్డు  మూడు నెలల్లో పూర్తిచేసి ఆస్పత్రిని ఓపెన్ చేస్తామని చెప్పారు.  ఆస్పత్రి రోడ్డుకు సంబంధించి  రూ.2 కోట్ల ప్రతిపాదనలు పెండింగ్‌‌లో ఉన్నాయని గుర్తుచేశారు.  ఈ సమావేశంలో బాదేపల్లి వ్యవసాయ మార్కెట్​ మాజీ చైర్మన్​ పిట్టల మురళి, మూడా డైరెక్టర్లు ఇమ్ము, శ్రీకాంత్, ప్రీతం, కౌన్సిలర్లు ప్రశాంత్​ రెడ్డి, చైతన్య చౌహాన్, బుక్క మహేశ్, ఉమాశంకర్​ గౌడ్​,శశికిరణ్​, సర్పంచులు రామకృష్ణారెడ్డి, ప్రభాకర్​ రెడ్డి, శ్రీనివాస్​ యాదవ్​,  మార్కెట్​ కమిటీ డైరెక్టర్లు శ్రీకాంత్​రెడ్డి, భీమ్​రాజ్, వసీం, శ్రీనివాస్​రెడ్డి  ఉన్నారు. 

రాహుల్​ పాదయాత్రకు గట్టి బందోబస్తు

మక్తల్​, వెలుగు: రాహుల్​ గాంధీ నిర్వహిస్తున్న  భారత్​ జోడో యాత్రకు గట్టి బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని ఎస్పీ వెంకటేశ్వర్లు చెప్పారు. సోమవారం కృష్ణా మండలంలోని  తెలంగాణ బార్డర్​వద్ద యాత్ర రూట్ మ్యాప్‌‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ జోడోయాత్ర ఈ నెల 23న  నారాయణపేట జిల్లాలోని కృష్ణా మండలంలోని బ్రిడ్జి దగ్గర రాష్ట్రంలోకి ఎంటర్‌‌‌‌ కానుందన్నారు. యాత్ర సాగే ప్రాంతాల్లో ముందస్తు బందోబస్తు ఏర్పాట్లు చేయాలని పోలీసులను ఆదేశించారు.  ఎస్పీ వెంట డీఎస్పీ సత్యనారాయణ , సీఐలు సీతయ్య, రామ్ లాల్, ఎస్సై విజయభాస్కర్  ఉన్నారు.

సిలిండర్​ పేలి ఇల్లు దగ్ధం

అచ్చంపేట, వెలుగు:  సిలిండర్​ పేలి ఇల్లు కాలిపోయిన ఘటన బల్మూర్​ మండలం కొండనాగుల గ్రామంలో జరిగింది. బాధితుల వివరాల ప్రకారం.. కొండనాగులకు చెందిన మహమ్మద్‌‌ బేగం ఒంటరిగా జీవిస్తోంది. నాలుగు రోజుల కింద ఇంటికి తాళం వేసి పెంట్లవెల్లి మండలం జటప్రోల్‌‌లోని బంధువుల వద్దకు వెళ్లింది. ఆదివారం సాయంత్రం సిలిండర్‌‌‌‌ పేలి ఇల్లు కూలడంతో పాటు వస్తువులన్నీ కాలిపోయాయి. విషయం తెలుసుకున్న బాధితురాలు సోమవారం ఇంటికి వచ్చి లబోదిబోమంది.   ఇంట్లో పెట్టెలో ఉన్న రూ. 82 వేలతో పాటు  3 తులాల బంగారు ఆభరణాలు కాలిపోయాయని వాపోయింది. తహసీల్దార్‌‌‌‌ కిష్ట్యానాయక్, ఎంపీపీ అరుణ సంఘటనా స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు.