రెడ్‌‌‌‌ అండ్‌‌‌‌ వైట్‌‌‌‌ తప్ప వాళ్ల లైఫ్‌‌‌‌లో వేరే కలర్‌‌‌‌‌‌‌‌ లేనే లేదు

V6 Velugu Posted on Jul 19, 2021

ప్రతి ఒక్కరికీ ఫేవరెట్‌‌‌‌ కలర్స్‌‌‌‌ ఉంటాయి. డ్రెస్‌‌‌‌లు, బెడ్‌‌‌‌షీట్స్ వంటి వాటిలో తమకు నచ్చిన కలర్‌‌‌‌‌‌‌‌వి కొనేందుకు ఎక్కువగా ఇంట్రెస్ట్‌‌‌‌ చూపిస్తుంటారు. అంతేకానీ, నచ్చిన రంగులు కదా అని పూర్తిగా ఆ కలర్స్‌‌‌‌ మాత్రమే వాడరు. కానీ, బెంగళూరుకు చెందిన ఒక ఫ్యామిలీ మాత్రం కొన్నేళ్లుగా తమకు నచ్చిన రెండు కలర్స్‌‌‌‌ మాత్రమే వాడుతున్నారు. ‘రెడ్‌‌‌‌ అండ్‌‌‌‌ వైట్‌‌‌‌ కలర్‌‌‌‌’‌‌‌‌ తప్ప వాళ్ల లైఫ్‌‌‌‌లో వేరే కలర్‌‌‌‌‌‌‌‌ లేనే లేదు. ఏం వాడినా ‘రెడ్‌‌‌‌ అండ్‌‌‌‌ వైట్‌‌‌‌’ మాత్రమే! అందుకే వాళ్లను ‘రెడ్‌‌‌‌ అండ్‌‌‌‌ వైట్‌‌‌‌ ఫ్యామిలీ’ అంటుంటారు. ఎవరికి ఎంత నచ్చిన రంగు అయినా, కొన్నింట్లో మాత్రమే ఆ కలర్‌‌‌‌‌‌‌‌ వాడతారు. ఒకే రంగు ఎక్కువగా వాడితే, ఎవరికైనా బోర్‌‌‌‌‌‌‌‌ కొడుతుంది. అందుకే ఫేవరెట్‌‌‌‌ కాని కలర్స్‌‌‌‌ కూడా వాడుతుంటారు. కానీ, బెంగళూరులోని సెవెన్‌‌‌‌రాజ్‌‌‌‌ అనే వ్యక్తి మాత్రం కొన్నేళ్లుగా రెడ్‌‌‌‌ అండ్‌‌‌‌ వైట్‌‌‌‌ కలర్స్‌‌‌‌ మాత్రమే వాడుతున్నాడు. అంతేకాదు.. ఫ్యామిలీ అంతా ఈ కలర్సే ఉపయోగిస్తారు. పైగా ఈ కలర్స్‌‌‌‌ మాత్రమే వాడుతుండటాన్ని వాళ్లు ఎంజాయ్‌‌‌‌ చేస్తున్నారు.
ఈ రంగులే ఎందుకంటే
బెంగళూరుకు చెందిన సెవెన్‌‌‌‌రాజ్‌‌‌‌ ఏడో సంతానం. అందుకే అతడ్ని సెవెన్‌‌‌‌ రాజ్‌‌‌‌గా పిలుస్తారు. రియల్‌‌‌‌ఎస్టేట్‌‌‌‌ బిజినెస్‌‌‌‌ చేస్తుంటాడు.  తన కంపెనీలో కూడా ఎక్కువగా రెడ్‌‌‌‌ అండ్‌‌‌‌ వైట్ కాంబినేషన్‌‌‌‌నే వాడతారు. సెవెన్‌‌‌‌రాజ్‌‌‌‌కు ఈ కలర్స్‌‌‌‌ ఎంత ఇష్టమంటే.. కొన్ని సంవత్సరాల నుంచి ప్రతి విషయంలో ఈ రెండు కలర్స్‌‌‌‌ మాత్రమే ఉండేలా చూసుకుంటున్నాడు. ఇల్లంతా రెడ్‌‌‌‌ అండ్‌‌‌‌ వైట్‌‌‌‌ కలర్‌‌‌‌‌‌‌‌లోనే ఉంటుంది. డోర్స్‌‌‌‌, ఫర్నిచర్‌‌‌‌‌‌‌‌, కర్టెన్స్‌‌‌‌, బెడ్‌‌‌‌షీట్స్‌‌‌‌, డెకొరేటివ్‌‌‌‌ ఐటమ్స్‌‌‌‌, ఎలక్ట్రానిక్స్‌‌‌‌, గాడ్జెట్స్‌‌‌‌, జువెలరీ.. ఇలా ఇంట్లోని అన్నీ ఈ  రంగుల్లోనే ఉంటాయి. చివరికి జీప్‌‌‌‌, కార్‌‌‌‌‌‌‌‌, బైక్‌‌‌‌ కూడా రెడ్‌‌‌‌ అండ్‌‌‌‌ వైట్‌‌‌‌లోనే. సెవెన్‌‌‌‌రాజ్‌‌‌‌తోపాటు ఆయన భార్య, కొడుకు, కూతురు కూడా ఈ కలర్‌‌‌‌‌‌‌‌ డ్రెస్‌‌‌‌లు మాత్రమే వాడతారు. టై, బెల్ట్‌‌‌‌, షూ, వాచీ వంటివన్నీ రెడ్‌‌‌‌ అండ్‌‌‌‌ వైట్‌‌‌‌లోనే. ఆయన ఆఫీస్‌‌‌‌లో కూడా అవే రంగులుంటాయి. ఈ కలర్స్‌‌‌‌ కాంబినేషన్‌‌‌‌లో మార్కెట్లో దొరక్కపోతే, తనే ప్రత్యేకంగా తయారు చేయించుకుంటాడు.
సెవెన్‌‌‌‌ నెంబర్‌‌‌‌‌‌‌‌ కూడా
సెవెన్‌‌‌‌రాజ్‌‌‌‌కు రెండు కలర్స్‌‌‌‌తోపాటు, సెవెన్‌‌‌‌ నెంబర్‌‌‌‌‌‌‌‌ అంటే కూడా ఇష్టం. తన సూట్‌‌‌‌పై సెవెన్‌‌‌‌ నెంబర్‌‌‌‌‌‌‌‌ ఉంటుంది. వెహికల్స్‌‌‌‌, ఫోన్‌‌‌‌ నంబర్స్‌‌‌‌ చివరలో సెవెన్‌‌‌‌ కచ్చితంగా ఉండాల్సిందే. ఈ కలర్స్‌‌‌‌, సెవెన్‌‌‌‌ నెంబర్‌‌‌‌‌‌‌‌ వాడటం వల్ల ఈ ఫ్యామిలీకి ప్రత్యేక గుర్తింపు దక్కింది. స్థానికంగా సెలబ్రిటీ స్టేటస్‌‌‌‌ వచ్చేలా చేసింది. అందరూ ‘రెడ్‌‌‌‌ అండ్‌‌‌‌ వైట్‌‌‌‌ ఫ్యామిలీ’గా పిలుస్తున్నారు. అయితే, ఈ కలర్‌‌‌‌‌‌‌‌ వాడటం సెవెన్‌‌‌‌రాజ్‌‌‌‌ బిజినెస్‌‌‌‌ స్ట్రాటజీ అని విమర్శించే వాళ్లు కూడా ఉన్నారు.

Tagged Red, white, Color.life, Famil

Latest Videos

Subscribe Now

More News