- వీరిలో ఎక్కువ మంది కలెక్టర్లు, అడిషనల్ కలెక్టర్లే
- 9 మందికి పోస్టింగ్ ఇవ్వని రాష్ట్ర సర్కార్
- త్వరలో మరిన్ని ట్రాన్స్ఫర్లు ఉండే చాన్స్
హైదరాబాద్, వెలుగు : రాష్ట్రంలో భారీగా ఐఏఎస్‌ల బదిలీ జరిగింది. రాష్ట్రవ్యాప్తంగా కలెక్టర్లు, అడిషనల్ కలెక్టర్లు 20 మందిని ఒకేసారి బదిలీ చేస్తూ సీఎస్ శాంతి కుమారి శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. త్వరలో సీఎం రేవంత్ రెడ్డి జిల్లాల పర్యటనలు, స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని కలెక్టర్లను బదిలీ చేసినట్లు తెలుస్తున్నది. కొద్ది రోజుల్లో మరికొందరు కలెక్టర్లు సహా రాష్ట్రస్థాయి సీనియర్ ఐఏఎస్ అధికారులను బదిలీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్నది.
పోలీస్ కమిషనర్లు, జిల్లా ఎస్పీలు సహా సీనియర్ ఐపీఎస్ అధికారుల బదిలీలు కూడా త్వరలో జరగనున్నాయి. శనివారం బదిలీ అయిన కలెక్టర్లలో వి.పి.గౌతమ్, పి.ఉదయ్ కుమార్, పమేలా సత్పతి, భవేశ్ మిశ్రా, యాస్మిన్ బాషా, జి. రవి, హరి చందన దాసరి, ఎస్.వెంకటరావు, తిరుపతికి ఇంకా పోస్టింగ్ ఇవ్వలేదు. వీరిలో కొందరి పనితీరుపై ప్రభుత్వం అసంతృప్తితో ఉంది. ప్రభుత్వం ఏర్పడిన కొత్తలో భారీగా బదిలీలు జరిగాయి.
ఎన్నికల నిబంధనలకు మేరకు బదిలీ చేసిన అన్ని శాఖల్లోని వివిధ స్థాయి ఉద్యోగులకు త్వరలో పెద్ద ఎత్తున స్థానచలనం ఉండనుంది. ఇప్పుడు ఆరు నెలల పనితీరుతో పాటు వివిధ పరిస్థితులు, సమీకరణలతో మరోసారి భారీగా ఐఏఎస్, ఐపీఎస్ ల బదిలీలు చేపట్టింది.
ఐఏఎస్ పేరు పాత స్థానం కొత్త స్థానం
ముజమిల్ ఖాన్ పెద్దపల్లి, కలెక్టర్ ఖమ్మం, కలెక్టర్
బడావత్ సంతోశ్ మంచిర్యాల, కలెక్టర్ నాగర్ కర్నూల్, కలెక్టర్
సందీప్ కుమార్ ఝా జేఎండీ ట్రాన్స్ కో రాజన్న సిరిసిల్ల, కలెక్టర్
అనురాగ్ జయంతి రాజన్న సిరిసిల్ల, కలెక్టర్ కరీంనగర్, కలెక్టర్
ఆశిష్ సంగ్వాన్ నిర్మల్, కలెక్టర్ కామారెడ్డి, కలెక్టర్
జితేశ్ వి.పాటిల్ కామారెడ్డి, కలెక్టర్ భద్రాద్రి కొత్తగూడెం, కలెక్టర్
రాహుల్ శర్మ అడిషనల్ కలెక్టర్, వికారాబాద్ భూపాలపల్లి, కలెక్టర్
సిక్తా పట్నాయక్ హనుమకొండ, కలెక్టర్ నారాయణపేట, కలెక్టర్
కోయ శ్రీహర్ష నారాయణపేట్, కలెక్టర్ పెద్దపల్లి, కలెక్టర్
పి.ప్రావీణ్య వరంగల్, కలెక్టర్ హన్మకొండ, కలెక్టర్
బుడుమజ్జి సత్యప్రసాద్ అడిషనల్ కలెక్టర్, ఖమ్మం జగిత్యాల, కలెక్టర్
బి.విజయేంద్ర బోయి స్పెషల్ సెక్రటరీ టీఆర్ అండ్ బీ మహబూబ్ నగర్, కలెక్టర్
కుమార్ దీపక్ అడిషనల్ కలెక్టర్, నాగర్ కర్నూల్ మంచిర్యాల,కలెక్టర్
ప్రతీక్ జైన్ ఐటీడీఏ పీవో, భద్రాచలం వికారాబాద్, కలెక్టర్
నారాయణరెడ్డి వికారాబాద్, కలెక్టర్ నల్గొండ, కలెక్టర్
ఆదర్శ్ సురభి మున్సిపల్ కమిషనర్, ఖమ్మం వనపర్తి, కలెక్టర్
తేజాస్ నందలాల్ పవార్ వనపర్తి, కలెక్టర్ సూర్యాపేట, కలెక్టర్
ఎం.సత్యశారదా దేవి జాయింట్ సెక్రటరీ, వ్యవసాయశాఖ వరంగల్, కలెక్టర్
టి.ఎస్.దివాకర అడిషనల్ కలెక్టర్, జగిత్యాల ములుగు, కలెక్టర్
అభిలాష అభినవ్ జోనల్ కమిషనర్, జీహెచ్ఎంసీ నిర్మల్, కలెక్టర్