ఈ యుద్ధంలో అందరూ బాధితులే: సౌదీ ప్రిన్స్

ఈ యుద్ధంలో అందరూ బాధితులే: సౌదీ ప్రిన్స్

వాషింగ్టన్: హమాస్, ఇజ్రాయెల్ యుద్ధంలో హీరో లు ఎవరూ లేరని, బాధితులు మాత్రమే మిగిలారని సౌదీ అరేబియా ప్రిన్స్, ఇంటెలిజెన్స్ విభాగం మాజీ చీఫ్ టర్కీ అల్ ఫైజల్ అన్నారు. మహిళలు, పిల్లలను చంపడం ఇస్లాంకు వ్యతిరేకమని.. కానీ హమాస్ మిలిటెంట్లు ఇస్లాం పేరుతో నరమేధానికి దిగడం సరికాదన్నారు. అమాయక ప్రజలపై హమాస్ ఊచకోత వల్ల ఇజ్రాయెల్ కు నైతికంగా బలం ఇచ్చినట్లు అయిందన్నారు. దాని ఫలితంగానే సైనికపరంగా శక్తిమంతంగా ఉన్న ఇజ్రాయెల్ దాడుల్లో ఇప్పుడు గాజా నాశనం అవుతోందన్నారు. 

అమెరికాలోని ఓ వర్సిటీలో ఆయన చేసిన ప్రసంగం వీడియో వైరల్ అయింది. స్వాతంత్ర్యం కోసం మిలిటరీ పరంగా కూడా పోరాటం చేయవచ్చు కానీ తాను మాత్రం ఇండియా తరహాలో ప్రజా విప్లవం, సహాయ నిరాకరణ విధానానికే మద్దతు ఇస్తానన్నారు. అయితే, మూడు దశాబ్దాలుగా పాలస్తీనాపై ఇజ్రాయెల్ అణచివేతలూ కోకొల్లలుగా ఉన్నాయన్నారు. ఇప్పటికైనా రెండు పక్షాలూ ఈ రక్తపాతం ఆపాలన్నారు.