ఔటర్ రింగ్ రోడ్ పై ఒళ్లు గగుర్పొడిచే ప్రమాదం

ఔటర్ రింగ్ రోడ్ పై ఒళ్లు గగుర్పొడిచే ప్రమాదం

ఆదిబట్ల : ఔటర్ రింగ్ రోడ్ పై ఒళ్లు గగుర్పొడిచే ప్రమాదం జరిగింది. ఓ కారు బైక్ ను ఢీకొట్టడంతో కానిస్టేబుల్ తీవ్రంగా గాయపడ్డాడు. ప్రస్తుతం బాధితుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. వనస్థలిపురం ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ లో రాజు అనే వ్యక్తి  కానిస్టేబుల్ గా విధులు నిర్వర్తిస్తున్నాడు. విధుల్లో భాగంగా ఔటర్ రింగ్ రోడ్ పై డ్యూటీ నిర్వహించి తిరిగి.. ఇబ్రహీంపట్నంలోని తన ఇంటికి వెళ్తుండగా ఓ కారు అతి వేగంగా వచ్చి ఢీకొట్టింది.

ఈ ఘటనలో కానిస్టేబుల్ రాజుకి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే బాధితుడిని ఆస్పత్రికి తరలించి.. చికిత్స అందిస్తున్నారు. రంగారెడ్డి జిల్లా ఆదిబాట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని భోంగ్లూర్ ఔటర్ రోడ్ వద్ద ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంపై పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.