ముందు నీ బిడ్డ సంగతి చూస్కో.. రిపబ్లికన్ పార్టీ డిబేట్​లో వివేక్, నిక్కీ గరంగరం

ముందు నీ బిడ్డ సంగతి చూస్కో..   రిపబ్లికన్ పార్టీ డిబేట్​లో వివేక్, నిక్కీ గరంగరం
  • ముందు నీ బిడ్డ సంగతి చూస్కో..  
  • రిపబ్లికన్ పార్టీ డిబేట్​లో వివేక్, నిక్కీ గరంగరం 

మయామి :  రిపబ్లికన్ పార్టీ తరఫున అమెరికా అధ్యక్ష అభ్యర్థిత్వం కోసం పోటీ పడుతున్న భారత సంతతి లీడర్లు నిక్కీ హేలీ, వివేక్ రామస్వామి మధ్య మరోసారి వాడివేడిగా చర్చ జరిగింది. చర్చ సందర్భంగా తన కూతురు పేరును రామస్వామి ప్రస్తావించడంతో నిక్కీ తీవ్రంగా మండిపడ్డారు. ఆయన ఒక చెత్త అంటూ కామెంట్ చేశారు. బుధవారం రాత్రి ఫ్లోరిడాలోని మియామిలో ఎన్బీసీ న్యూస్ ఆధ్వర్యంలో జరిగిన రిపబ్లికన్ థర్డ్ డిబేట్​లో ప్రెసిడెంట్ క్యాండిడేట్ రేసులో ఉన్న ఐక్యరాజ్యసమితి మాజీ అంబాసిడర్ నిక్కీ హేలీ, బయోటెక్ ఎంట్రప్రెన్యూర్ వివేక్ రామస్వామి, సౌత్ కరోలినా సెనెటర్ టిమ్ స్కాట్, న్యూజెర్సీ మాజీ గవర్నర్ క్రిస్ క్రిస్టీ, ఫ్లోరిడా గవర్నర్ రాన్ డీ శాంటిస్ పాల్గొన్నారు. రేసులో వీరందరికంటే ఎంతో ముందంజలో ఉన్న మాజీ ప్రెసిడెంట్ ట్రంప్ ఈ డిబేట్​కు హాజరుకాలేదు. చర్చ సందర్భంగా ఇజ్రాయెల్​కు అందరు అభ్యర్థులూ మద్దతు ప్రకటించారు. అయితే, అమెరికాలో టిక్ టాక్ బ్యాన్ అంశంపై నిక్కీ, వివేక్ మధ్య వాగ్వాదం జరిగింది.

టిక్ టాక్ లోకి వివేక్ ఎంటర్ కావడాన్ని నిక్కీ తప్పుపట్టారు. దీంతో ఆమె కూతురు కూడా టిక్ టాక్ వాడుతోందని.. ముందుగా ఇంట్లో వాళ్లను చక్కదిద్దుకోవాలంటూ వివేక్ కామెంట్ చేశారు. తన కుటుంబాన్ని ఇందులోకి లాగొద్దని నిక్కీ హెచ్చరించారు. గతంలో ట్రంప్ ను విమర్శించి పార్టీ నుంచి బహిష్కరణకు గురైన మాజీ వైస్ ప్రెసిడెంట్ డిక్ చైనీ, ఆయన కూతురు లిజ్ తో డీ శాంటిస్ ను, నిక్కీని పోలుస్తూ వివేక్ కామెంట్ చేశారు. దీంతో ఆయన ఒక చెత్త అంటూ హేలీ మండిపడ్డారు.