
నలుగురు కుటుంబ సభ్యులు ఉన్న కుటుంబం ఎక్కడికైనా వెళ్లాలంటే బైక్‌నే ఎంచుకుంటారు. అలాంటి వారి కోసం రతన్‌టాటా అప్పట్లో నానో కారును లాంచ్ చేశారు. అందులో వారు సౌకర్యంగా ప్రయాణించేవారు. మరి పాకిస్థాన్‌కి చెందిన కార్ల తయారీ కంపెనీలు తమ దేశ పౌరుల కోసం ఇలాంటి ఆలోచన చేయట్లేదేమో.. ఈ వీడియో చూస్తే అలానే అనిపిస్తుంది.
వెనక కూర్చోబెట్టి ప్రయాణం..
ఇటీవల ఇన్ స్టాగ్రామ్ లోని ఓ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఓ కారులో ప్రయాణిస్తున్న కుటుంబం చిన్నారులను కారు వెనక వైపున ఉన్న పంజరంలాంటి భాగంలో ఉంచి ప్రయాణిస్తోంది. వెనక వైపు పిల్లలు ఇరుగ్గా కూర్చున్నారు. పాకిస్థాన్‌లోని కరాచీ ప్రాంతంలో ఈ వీడియో తీసినట్లు తెలుస్తోంది. ఈ విషయంలో కరాచీ చాలా పురోగతి సాధించిందని ఆ వీడియో తీస్తున్న వారు అన్నారు. అలా ప్రయాణించడం ప్రమాదకరమని సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. ఈ వీడియోకు 28 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి.