ఎయిర్ పోర్టుల్లో స్కానింగ్ కోసం టోమోగ్రఫీ టెక్నాలజీ

ఎయిర్ పోర్టుల్లో స్కానింగ్ కోసం  టోమోగ్రఫీ టెక్నాలజీ

ఎయిర్‌పోర్ట్ సెక్యూరిటీ స్కాన్ కోసం హ్యాండ్ బ్యాగుల నుండి ఎలక్ట్రానిక్‌ వస్తువులను ఇకనుంచి తీసివేయాల్సిన అవసరం లేదు. దాని కోసం ఎయిర్ పోర్టులలోని కంప్యూటర్లలో టోమోగ్రఫీ టెక్నాలజీ ఆధారంగా పనిచేసే స్కానర్లను ఉంచాలని బ్యూరో ఆఫ్ ఏవియేషన్ సెక్యూరిటీ బీసీఏఎస్ తెలిపింది. మామూలుగా ఎయిర్ పోర్టుల్లో తమ బ్యాగులను స్కానింగ్ కోసం పంపిస్తున్నపుడు మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, ఛార్జర్లు.. లాంటి ఇతర ఎలక్ట్రానిక్‌ పరికరాలను బయటికి తీస్తుంటారు. 

అయితే ఇకనుంచి అలా వాటిని తీయకుండా ఉండేందు ఓ కొత్త సాంకేతికతను త్వరలో దేశంలోని విమానాశ్రయాల్లో అందుబాటులోకి రానుంది. కంప్యూటర్‌ టోమోగ్రఫీ టెక్నాలజీ ఆధారంగా పనిచేసే ఈ కొత్త స్కానర్లతో చేతి సంచుల్లోని వస్తువులకు సంబంధించిన త్రీడీ చిత్రాలు ఇక నుంచి భద్రతా సిబ్బందికి స్పష్టంగా కనిపించనున్నాయి. భద్రతా తనిఖీలూ కూడా తొందరగా పూర్తవుతాయని పౌరవిమానయాన భద్రతా విభాగం జాయింట్‌ డైరెక్టర్‌ జనరల్‌ జైదీప్‌ ప్రసాద్‌ తెలిపారు.