టిక్‌‌టాక్‌‌కు ఇండియన్ వెర్షన్‌‌గా ఠీక్ ఠాక్

టిక్‌‌టాక్‌‌కు ఇండియన్ వెర్షన్‌‌గా ఠీక్ ఠాక్

పాపులర్ వీడియో యాప్ టిక్‌‌టాక్‌‌పై భారత్‌లో నిషేధం విధించిన సంగతి తెలిసిందే. టిక్‌టాక్ మార్కెట్‌‌ను క్యాష్ చేసుకోవడానికి చాలా దేశీ కంపెనీలు యత్నిస్తున్నాయి. ఈ క్రమంలో ఠీక్ ఠాక్ (అంతా సజావుగా ఉంది అని హిందీలో అర్థం) అనే కొత్త యాప్ విడుదలైంది. ఈ యాప్‌‌ను భారత సంతతికి చెందిన 17 ఏళ్ల యూకే యువతి సైనా సోధి అనే  డెవలప్ చేశారు.

భారత జాతీయ జెండా స్ఫూర్తిగా ఠీక్ ఠాక్‌‌ థీమ్‌లో తెలుపు, ఆకుపచ్చ, నారింజ రంగులు వచ్చేలా డిజైన్ చేశారు. తమిళం, గుజరాతీతోపాటు ఎనిమిది భారతీయ భాషల్లో ఈ యాప్‌ను ఆండ్రాయిడ్, ఐవోఎస్ యూజర్ల కోసం అందుబాటులో ఉంచారు. టిక్‌‌టాక్ యాప్‌‌కు భారతీయ వెర్షన్ ఉండాలని తాను కోరుకున్నానని, అందుకు తగ్గట్లే దేశీ అభిరుచులకు అద్దం పట్టేలా ఠీక్ ఠాక్‌‌ను డెవలప్ చేశానని సైనా సోధి తెలిపారు. ఈ యాప్‌‌లో వీడియో అప్‌‌లోడింగ్, వీడియో ఎడిటింగ్ టూల్స్, సోషల్ షేరింగ్ సౌండ్స్, లైవ్ స్ట్రీమింగ్, జియోలొకేషన్ రియాక్షన్స్‌‌తోపాటు ఠీక్‌‌కోడ్ స్కానర్స్‌‌ లాంటి సర్వీసులను అందుబాటులో ఉంచామన్నారు.