భారతీయులు పెట్టుకునే అత్యంత చెత్త పాస్వర్డ్లు ఇవే

భారతీయులు పెట్టుకునే అత్యంత చెత్త పాస్వర్డ్లు ఇవే

ఇంటర్నెట్ యుగంలో డేటా భద్రంగా ఉండాలంటే పాస్వర్డ్ తప్పనిసరి. పాస్వర్డ్ లేదంటే సమాచారం చాలా ఈజీగా చోరీకి గురయ్యే అవకాశముంది. అందుకే సోషల్ మీడియా అకౌంట్ల నుంచి బ్యాంక్ ఖాతాల వరకు ప్రతిదానికి పాస్ వర్డ్ పెట్టుకోవడం కంపల్సరీ. కానీ విదేశీయులతో పోలిస్తే హై సెక్యూరిటీ పాస్వర్డ్ విషయంలో భారతీయులు చాలా వెనకబడి ఉన్నారట. సెక్యూరిటీ సొల్యూషన్ కంపెనీ నార్డ్పాస్ ఈ విషయాన్ని వెల్లడించింది. ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఈ సంస్థ 200 అత్యంత చెత్త పాస్ వర్డ్స్ లిస్టును రిలీజ్ చేసింది. అందులో 50 పాస్వర్డ్లు భారతీయుల పేర్లు కావడం గమనార్హం. సైబర్ నేరగాళ్లు ఈ చెత్త పాస్వర్డ్ లలో కొన్నింటిని నిమిషాల వ్యవధిలో మరికొన్నింటిని క్షణాల వ్యవధిలోనే క్రాక్ చేయగలుగుతారని నార్డ్పాస్ వెల్లడించింది.భారతీయుల్లో ఎక్కువ మంది పేర్లను పాస్వర్డ్గా ఉపయోగిస్తున్నారని నార్డ్పాస్ నివేదిక స్పష్టం చేస్తోంది. వీటిలో ఏదైనా పేరును పాస్వర్డ్గా పెట్టుకుని ఉంటే వెంటనే మార్చుకోవాలని సూచించింది. 

నార్డ్పాస్ లిస్టులోని అత్యంత చెత్త పాస్వర్డ్లు 
అభిషేక్, ఆదిత్య, ఆశిష్, అంజలి, అర్చన, అనురాధ, దీపక్, దినేష్, గణేష్, గౌరవ్, గాయత్రి, హనుమాన్, హరి ఓం, హర్ష, కృష్ణ, ఖుషి, కార్తీక్, లక్ష్మి, లవ్లీ, మనీష్, మనీషా, మహేష్, నవీన్, నిఖిల్, ప్రియాంక, ప్రకాష్, పూనమ్, ప్రశాంత్, పంకజ్, ప్రసాద్, ప్రదీప్, ప్రవీణ్, రష్మి, రాహుల్, రాజ్ కుమార్, రాకేశ్, రమేష్, రాజేష్, సాయిరామ్, సచిన్, సంజయ్, సందీప్, స్వీటీ, సురేష్, సంతోష్, సిమ్రాన్, సంధ్య, సన్నీ, టింకిల్, విశాల్.