పుచ్చకాయ తిన్నాక తీసుకోకూడని ఫుడ్స్​ ఇవే...!

పుచ్చకాయ తిన్నాక తీసుకోకూడని ఫుడ్స్​ ఇవే...!

పుచ్చకాయ తినడం ఎవరికి ఇష్టముండదు చెప్పండి. వేసవి కాలంలో ఇది శరీరానికి చాలా మంచిది. అయినప్పటికీ కొన్ని పొరపాట్ల కారణంగా దాని కొనుగోలుకు వెచ్చించిన డబ్బు వృథా అవుతుంది. అదెలా అనుకుంటున్నారా? పుచ్చకాయ తో పాటు పలు ఆహార పదార్థాలు తీసుకుంటే జీర్ణాశయంలో ఇబ్బంది కలగవచ్చు. దీంతో పుచ్చకాయ ద్వారా వచ్చే లాభాలన్నీ వృథా కావచ్చు.  అందుకే పుచ్చకాయ తిన్న తర్వాత కొన్ని ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. అవేంటో తెలుసుకుందాం...

1.పాలు

పుచ్చకాయ తిన్న తర్వాత పాలు తీసుకోవడం వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. పుచ్చకాయలో విటమిన్​ సి ఉంటుంది. అది తీసుకున్న అనంతరం పాలు తాగితే ఉబ్బరం కలుగుతుంది. తద్వారా జీర్ణ సమస్యలు ఎదురవుతాయి.

2. ప్రొటీన్​ ఫుడ్స్​

పుచ్చకాయ తిన్న తర్వాత ప్రొటీన్లు అధికంగా ఉన్న ఆహారాన్ని తీసుకోవడం వల్ల శరీరానికి హానీ కలుగుతుంది. పప్పులు, ప్రొటీన్​రిచ్​ ఫుడ్స్​తీసుకోవడం జీర్ణ ఎంజైమ్​లను దెబ్బతీస్తుంది. 

3. గుడ్డు

పుచ్చకాయ తిన్న తర్వాత గుడ్డు తినడం వల్ల పొట్ట సమస్యలు వస్తాయి. గుడ్లలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి. పుచ్చకాయలో అధికంగా నీరు ఉంటాయి. అలాంటప్పుడు ఇవి రెండు కలిస్తే జీర్ణాశయ, మలబద్ధకం తదితర సమస్యలు వస్తాయి. కాబట్టి, పుచ్చకాయ తిన్న తర్వాత ఈ ఆహార పదార్థాలను తీసుకోకుండా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. వీటిని తీసుకోవాల్సి వస్తే కనీసం 30 నిమిషాల పాటు ఏమీ తినకుండా ఉండటమే మంచిదని అంటున్నారు.