ప్రపంచంలో అత్యంత ఖరీదైన విడాకులు

ప్రపంచంలో అత్యంత ఖరీదైన విడాకులు

పెళ్లంటే నూరేళ్ల పంట. ఇద్దరు ఒక్కటై జీవితాంతం కలసిమెలసి అన్యోన్యంగా ఉండటమే వివాహానికి నిజమైన అర్థం. అందుకే స్థోమతను బట్టి కొందరు అట్టహాసంగా చేసుకుంటే.. మరికొందరు తమ తాహతును బట్టి జరుపుకొంటారు. అయితే, కొందరు దంపతుల విషయంలో పెళ్లిళ్లే కాదు.. విడాకులు కూడా ఖరీదైన వ్యవహారంగా మారింది. ముఖ్యంగా విడాకుల సమయంలో ఇచ్చే భరణాల గురించి ప్రపంచమంతా మాట్లాడుకునేంతగా! అలాంటి కొన్ని భారీ విడాకుల వ్యవహారాలేంటో చూద్దాం.. 

ప్రముఖ ఆన్ లైన్ షాపింగ్ కంపెనీ అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్, మెకంజీ స్కాట్ ల విడాకుల వ్యవహారం అత్యంత ఖరీదైనదిగా రికార్డు సృష్టించింది. పాతికేళ్ల వైవాహిక బంధానికి స్వస్తి పలుకుతూ ఈ ఇద్దరూ.. 2019 ఆఖర్లో డైవోర్స్ తీసుకున్నారు. ఈ క్రమంలో భరణం కింద స్కాట్ కు అమెజాన్ లో 4 శాతం వాటా దక్కడం గమనార్హం. మొత్తంగా బెజోస్ నుంచి స్కాట్ కు 38 మిలియన్ డాలర్లు (భారత కరెన్సీలో సుమారుగా రూ.2.80 లక్షల కోట్లు) లభించాయని అంతర్జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి. కాగా, బెజోస్ నుంచి విడాకులు తీసుకున్న కొంతకాలానికి మళ్లీ పెళ్లి చేసుకున్నట్లు మెకంజీ రీసెంట్ గా వెల్లడించారు. 

మైక్రోసాఫ్ట్ కోఫౌండర్, ప్రపంచ కుబేరుల్లో ఒకరైన బిల్ గేట్స్, మెలిందాతో ఉన్న 27 ఏళ్ల వివాహ బంధానికి ముగింపు పలికారు. ఈ ఏడాది మే నెలలో తాము విడిపోతున్నట్లు వీరు ప్రకటించారు. అయితే, వారిద్దరి సంపద విలువ అప్పట్లో 130 బిలియన్ డాలర్లుగా పలు అంతర్జాతీయ నివేదికలు వెల్లడించాయి. విడాకుల నేపథ్యంలో ఆస్తుల పంపకం గురించి అధికారిక ప్రకటన రాకపోయినప్పటికీ.. ఖరీదైన విడాకుల జాబితాలో వీరు చేరతారనే వార్తలు వచ్చాయి. 

దుబాయ్ రాజు షేక్ మహ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూం (72) విషయంలో బ్రిటన్ హైకోర్టు షాకింగ్ తీర్పు ఇచ్చింది. తన మాజీ భార్య, జోర్డాన్ రాకుమారి హయా బింత్ అల్ హుస్సేన్ (47)కు.. వీళ్లిద్దరికీ పుట్టిన పిల్లలకు రూ.5,555 కోట్లు (554 మిలియన్ పౌండ్లు) కట్టితీరాలంటూ కోర్టు తీర్పు చెప్పింది. దీన్ని బ్రిటిష్ చరిత్రలో అత్యంత ఖరీదైన భరణంగా చెబుతున్నారు. మొత్తం భరణంలో రూ.2,521 కోట్లు మాజీ భార్యకు మూడు నెలల్లోగా చెల్లించాలని కోర్టు తెలిపింది. మిగిలిన మొత్తాన్ని వీరి పిల్లలైన అల్ జలీలా (14), జయేద్ (9)కు బ్యాంకు గ్యారెంటీతో చెల్లించాలని స్పష్టం చేసింది. మాజీ భార్య, పిల్లల (మైనారిటీ పూర్తయ్యేదాకా) బాధ్యత కింద ఏటా రూ.110 కోట్లతోపాటు పిల్లల చదువు కోసం మరికొంత డబ్బును పెద్ద మొత్తంలో కలిపారు. 

ఇకపోతే, ఆస్ట్రేలియన్, అమెరికన్ వ్యాపారవేత్త మీడియా మొఘల్ గా పేరుగాంచిన రూపెర్ట్ మర్దోక్, అన్నా మరియా మన్ 1999లో విడాకులు తీసుకున్నారు. ఆ టైమ్ లో అన్నా మన్ కు భరణం రూపంలో రూపెర్ట్ దాదాపు 1.7 బిలియన్ డాలర్ల ఆస్తి అందజేసినట్లు సమాచారం. అమెరికన్ నటుడు, ఆస్కారు అవార్డు గ్రహీత మెల్ గిబ్సన్, రాబిన్ మూరే దంపతుల విడాకుల కూడా ఖరీదైనవిగా రికార్డుకెక్కాయి. రాబిన్ ను ప్రేమ వివాహం చేసుకున్న మెల్ గిబ్సన్ సంపద అప్పట్లో 850 మిలియన్ డాలర్లుగా అంచనా. 

మరిన్ని వార్తల కోసం: 

ప్రియాంక పిల్లల ఇన్‌స్టా అకౌంట్స్ హ్యాక్ కాలేదు

ఫెయిల్ అయిన వారిలో ప్రభుత్వ కాలేజీ విద్యార్ధులే ఎక్కువ