లాక్​డౌన్ లో ట్రెండింగ్​ టాప్​లో నిలిచిన వంటకాలివే..

లాక్​డౌన్ లో ట్రెండింగ్​ టాప్​లో నిలిచిన వంటకాలివే..

లాక్​డౌన్​లో చాలామంది చేస్తున్న పని కొత్త వంటలు ట్రై చెయ్యడం. ఇందుకోసం ఇంటర్నెట్​లో తెగ సెర్చ్​ చేస్తున్నారు. అయితే ఇంటర్నెట్​లో ఏ వంటకం గురించి ఎక్కువగా సెర్చ్​ చేశారు? ట్రెండింగ్​లో టాప్​లో నిలిచిన వంటకాలేంటంటే

​వెదురు చిగురు

లాక్​డౌన్​ టైంలో మాత్రం ఆసియా మొత్తంగా వెదురు చిగురుతో చేసే వంటకాల గురించి సెర్చ్​ చేసినవాళ్ల సంఖ్య 4,850 శాతం పెరిగిందట. ఇదే స్థాయిలో బనానా బ్రెడ్​ ఎలా తయారు చేయాలో కూడా వెతికారట.

వెదురు చిగురుతో ఏం చేస్తారంటే..

వెదురు మొక్కలు ఐదారు ఇంచులు పెరగ్గానే తెంపేస్తారు. ఈ టైంలో అవి సువాసనతో ఉండి, కరకరలాడుతుంటాయి. వీటిని చిన్నచిన్న ముక్కలుగా కట్​చేసి సూప్​లలో, ఫ్రైలలో వేసుకుంటారు. కొంతమంది నూడుల్స్​లో, మష్రూమ్స్​, పోర్క్​ కూరల్లో కూడా వేసుకుంటారు.

పాన్​కేక్​, ఈస్టర్​ కేక్​

కేక్​ ఫ్లఫ్ఫీగా రావాలంటే ఏం చేయాలని వెతికినవాళ్ల సంఖ్య 600 శాతం పెరిగింది.ఈస్టర్​కు ముందు, ఈస్టర్​ తర్వాత కూడా ఇంట్లోనే కేక్​ తయారు చేయడమెలా? అనే లింక్స్​ సెర్చ్​ చేశారు.

హైదరాబాదీ​ దమ్​ బిర్యానీ

మనదేశంలో ఎక్కువ మంది సెర్చ్​ చేసిన వంటకం హైదరాబాద్​ బిర్యానీ.​ రెస్టారెంట్​ స్టైల్, టేస్ట్​తో ఎలా వండుకోవాలని వెతికిన వాళ్ల సంఖ్య ఎప్పటికంటే 540 శాతం పెరిగింది.

టోఫు వంటకాలు

కేక్​ల తర్వాత ఎక్కువగా ట్రెండ్​ అయిన వంటకం టోఫు. టోఫుతో ఎన్నిరకాల వెరైటీ వంటలు చేసుకోవచ్చని గూగుల్​ సెర్చ్​ చేసిన వాళ్లు 265 శాతం పెరిగారు.

బనానా బ్రెడ్​

షుగర్​ లేకుండా బనానాతో స్వీట్​ బ్రెడ్​ తయారు చేయడం ఎలాగో తెలుసుకునేందుకు గూగుల్ సెర్చ్​ చేశారట. వెదురు చిగురు తర్వాత ఎక్కువ మంది సెర్చ్​ చేసింది బనానా బ్రెడ్​.

ఎగ్​ స్పెషల్స్​

ఎగ్​తో చేసే రకరకాల స్పెషల్స్​ కోసం గూగుల్​లో​ వెతికారు. అయితే దీంతో పోలిస్తే ఎగ్​ కాంబినేషన్​లో చేసే వంటకాల గురించి సెర్చ్​ చేసినవాళ్ల సంఖ్యే ఎక్కువగా ఉంది.

పత్తాలేని సమ్మర్​ స్పెషల్స్​

సమ్మర్​లో చేసుకునే కూల్​ కూల్​ ఐటమ్స్​ గురించి చేసే సెర్చ్​ చాలా తగ్గిపోయింది. చల్లటి పదార్థాలతో కరోనా వైరస్​ స్ప్రెడ్​ అవుతుందనే భయమే ఇందుకు కారణం కావచ్చంటున్నారు.