మేడారం మహజాతరకి వెహికల్స్‌‌‌‌ రూట్ ఇవే

మేడారం మహజాతరకి  వెహికల్స్‌‌‌‌ రూట్ ఇవే
  • ఫిబ్రవరి 21 నుంచి 24వ తేదీ వరకు నిర్వహించే మహాజాతర సమయంలో వన్‌‌‌‌వే రూల్స్‌‌‌‌ అమల్లో ఉంటాయి. హైదరాబాద్‌‌‌‌, నల్గొండ, కరీంనగర్‌‌‌‌, వరంగల్, హన్మకొండ మీదుగా వచ్చే ప్రైవేట్‌‌‌‌ వెహికల్స్‌‌‌‌ ములుగు దాటాక పస్రా దగ్గర క్రాస్‌‌‌‌ తీసుకోవాలి. ఇక్కడి నుంచి  నార్లాపూర్ మీదుగా మేడారం చేరుకోవాలి. జాతర ముగించుకొని తిరుగు ప్రయాణంలో నార్లాపూర్, బయ్యక్క పేట, గోళ్లబుద్ధారం, కమలాపురం క్రాస్ మీదుగా భూపాల పల్లి, రేగొండ, పరకాల నుంచి హన్మకొండకు వెళ్లాలి.
  • గోదావరిఖని, మంచిర్యాల, పెద్దపెల్లి, మహారాష్ట్ర, కాళేశ్వరం నుంచి వచ్చే వెహికల్స్‌‌‌‌ కాటారం నుంచి క్రాస్‌‌‌‌ చేసుకొని కాల్వపల్లి, సింగారం, బోర్లగూడెం, పెగడ పల్లి, చింతకాని మీదుగా మేడారం చేరుకోవాలి. తిరుగు ప్రయాణంలో నార్లాపూర్, బయ్యక్క పేట, గోళ్లబుద్ధారం, కమలాపురం క్రాస్ మీదుగా వెళ్లొచ్చు. 
  •  ఛత్తీస్ గఢ్​, భద్రాచలం, మణుగూరు నుంచి వచ్చే వెహికల్స్‌‌‌‌ ఏటూరునాగారం, చిన్న బోయినపల్లి దగ్గర క్రాస్‌‌‌‌ చేసుకొని కొండాయి, ఉరట్టం మీదుగా మేడారం చేరుకోవాలి.  తిరుగు ప్రయాణంలో ఇదే దారిలో వెళ్ళిపోతారు. 
  •  ఖమ్మం, మహబూబాబాద్ నుంచి వచ్చే వెహికల్స్‌‌‌‌ నర్సంపేట మీదుగా ములుగు మండలం మల్లంపల్లి హైవే దగ్గర కలిసి, ములుగు, పసర, నార్లాపూర్, మీదుగా మేడారం చేరుకోవాలి. తిరుగు ప్రయాణంలో నార్లాపూర్, కమలాపూర్ క్రాస్, భూపాలపల్లి, పరకాల, గుడెప్పాడ్ మీదుగా మళ్ళీ మల్లంపల్లికి వచ్చి ఇక్కడ క్రాస్‌‌‌‌ తీసుకొని తమ గమ్య స్థానాలకు చేరుకుంటారు. 
  • ఆర్టీసీ బస్సులు, వీఐపీ, వీవీఐపీ వెహికల్స్‌‌‌‌ అన్నీ కూడా తాడ్వాయి దగ్గర క్రాస్‌‌‌‌ తీసుకొని మేడారం చేరుకోవాలి. తిరిగి ఇదే రూట్‌‌‌‌లో ఈ వెహికల్స్‌‌ వెనక్కి వెళ్తాయి.