ఆన్‌లైన్‌లో పురుగుల మందులు అమ్మొచ్చని చెప్పిన కేంద్రం

ఆన్‌లైన్‌లో పురుగుల మందులు అమ్మొచ్చని చెప్పిన కేంద్రం

ప్రతీ ఏడాది పంటలకు సరైన టైంలో పురుగుల మందులు అందక చాలావరకు పంటనష్టం జరుగుతుంటుంది. ప్రతీ ఊళ్లో ఫెర్టిలైజర్‌‌ దుకాణాలు ఉన్నా, వాటిలో నకిలీ విత్తనాలు అమ్ముతూ చాలామంది రైతులను మోసం చేస్తుంటారు. అయితే దీన్ని తగ్గించడానికి భారత ప్రభుత్వం కొత్త ఆలోచనతో ముందుకు వచ్చింది. ఈ కామర్స్ వెబ్‌సైట్స్ అంటే అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌ల్లో పురుగుల మందులు అమ్ముకోవచ్చని అనుమతులు ఇచ్చింది.

కాకపోతే దీనికి సంబంధించి కొన్ని నియమ నిబంధనల్ని జారీ చేసింది. ఎవరు పడితే వాళ్లు కాకుండా ప్రభుత్వం నుంచి లైసెన్స్ పొందిన వ్యాపారులకే ఆన్‌లైన్‌లో పురుగుల మందులు అమ్ముకునే వీలు కల్పించింది. దీనిద్వారా రైతులు రోజుల తరబడి వేచిచూడాల్సిన పనిలేదు. నేరుగా ఇంటివద్దకే డెలివరీ అందుతాయి. డెలివరీ తీసుకున్న పెస్టిసైడ్స్‌లో ఏవన్నా తేడాలున్నా, నకిలీవి డెలివరీ అయినా నేరుగా కేంద్ర వ్యవసాయ శాఖకు పిరియాదులు అందించొచ్చు. 

అయితే, ఈ ఆలోచన ఎంతవరకు సక్సెస్ అవుతుందనేది వేచి చూడాలి. ఆన్‌లైన్‌లో అమ్మినా దళారుల వద్దకు చేరే అవకాశాలు లేకపోలేదు. బ్లాక్ మార్కెట్ దందా పెరిగే ఛాన్స్‌లు చాలా ఉన్నాయి. గ్రామీణ ప్రాతాల్లో ఉండే ప్రజలకు ఇవి ఎలా చేరుతాయనేది పెద్ద క్వచ్చన్‌ మార్క్. ఆన్‌లైన్‌లో ఆర్డర్ పెట్టి తప్పుడు దారుల్లో వాడే అవకాశాలు కూడా ఉన్నాయి.