కరోనాను ఎదిరించడంలో ఈ నాలుగే బెస్ట్ అట

కరోనాను ఎదిరించడంలో ఈ నాలుగే బెస్ట్ అట

కరోనా మహమ్మారి వచ్చాక చాలామంది రకరకాల ఫుడ్స్ తింటున్నారు. అయితే వీటిలో ఏ ఫుడ్‌ ఎఫెక్టివ్‌గా పనిచేస్తుంది? అదే విషయాన్ని సైంటిస్టులు గుర్తించారు. జర్మనీకి చెందిన ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మాలిక్యులార్‌‌ వైరాలజీ, యూఐఎమ్‌ యూనివర్సిటీ మెడికల్‌ సెంటర్‌‌ సైంటిస్టుల  స్టడీ ప్రకారం గ్రీన్‌ టీ, దానిమ్మ, క్రాన్‌బెర్రీ, చోక్‌బెర్రీ.. కోవిడ్‌ను అడ్డుకోవడంలో ఎఫెక్టివ్‌గా పనిచేస్తున్నాయట.

రకరకాల గ్రీన్‌ టీలు అందుబాటులో ఉన్నా వాటిలో ఉన్న యాంటీ బ్యాక్టీరియల్‌ గుణాలు వైరస్‌పై పోరాడుతున్నాయి.

ఫ్లూను అరికట్టే లక్షణాలు కూడా గ్రీన్‌ టీలో ఉంటాయి.

దానిమ్మలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్‌ డైరెక్ట్​గా కరోనా వైరస్‌పై పోరాడకున్నా ఓవరాల్‌ హెల్త్‌ విషయంలో బాగా పనిచేస్తాయి. క్రాన్‌బెర్రీలో ఉండే విటమిన్‌–సి ఇమ్యూనిటీని పెంచుతుంది.

చోక్‌బెర్రీస్‌ కూడా కోవిడ్‌ను అరికట్టడంలో మిగతా వాటికంటే బెటర్‌‌గా పనిచేస్తాయి అంటున్నారు సైంటిస్ట్​లు.