
సీజన్ ఏదైనా జుట్టు అందంగా, ఆరోగ్యంగా ఉండాలంటే ఈ చిన్న చిన్న జాగ్రత్తలు తప్పనిసరి... వాతావరణం వేడిగా ఉంటే తలకు నూనె బదులు హెయిర్ సిరమ్ వాడాలి. తలస్నానానికి ఎప్పుడూ తక్కువ గాఢత ఉన్న షాంపూలనే వాడాలి. ఇవి జుట్టులోని తేమని కాపాడి, చివర్లు చిట్లకుండా చూస్తాయి. స్ట్రయిట్నర్, కర్లర్ వాడే ముందు తప్పనిసరిగా కండీషనర్, హెయిర్ ప్రొటెక్షన్ సిరమ్ రాయాలి. జుట్టు ఆరోగ్యంగా ఉండాలంటే కెరటిన్, పాంతెనాల్, అలొవెరా ప్రొడక్ట్స్నే ఎంచుకోవాలి. పొల్యూషన్ నుంచి జుట్టుని కాపాడుకోవడానికి తలకు టోపీ పెట్టుకోవాలి. లేదా స్కార్ఫ్ , స్టోల్ కట్టుకోవాలి. దువ్వెనలు, బ్రష్లను తరచూ వేడినీళ్లతో కడగాలి. వేరేవాళ్ల దువ్వెనల్ని అస్సలు వాడకూడదు.