వంట చేస్తున్నా చర్మం మెరిసేందుకు ఈజీ టిప్స్

వంట చేస్తున్నా చర్మం మెరిసేందుకు ఈజీ టిప్స్

 ఎంత హెల్దీగా ఉంటే... స్కిన్‌‌ అంత క్లియర్‌‌‌‌గా ఉంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే చర్మాన్ని బట్టి ఆరోగ్యం ఎలా ఉందనేది చెప్పేయొచ్చు. హెల్దీగా ఉండాలంటే తినే తిండిపై జాగ్రత్త ఉండాలి. చర్మం మెరుస్తూ ఉండాలంటే నీళ్లు ఎక్కువగా తాగాలి. సీజనల్‌‌ ఫుడ్‌‌ తినాలి. యాంటాక్సిడెంట్స్‌‌ ఎక్కువగా ఉండే మిక్స్‌‌డ్‌‌ గ్రీన్స్‌‌, కూరగాయలు, చేప, పండ్లు తినాలి. తీపి పదార్థాలు, జంక్‌‌ఫుడ్‌‌, డ్రింక్స్‌‌ పూర్తిగా మానేయాలి. తిండి కరెక్ట్‌‌గా తీసుకుంటే చర్మం మృదువుగా ఉంటుంది. మెరుస్తుంది. 

  • చర్మ సంరక్షణకు క్లెన్సింగ్‌‌ చాలా ముఖ్యం. ముఖంపై జిడ్డు వదలాలంటే క్లెన్సింగ్‌‌ చేయాల్సిందే. దానివల్ల చర్మం పొడిబారదు. కెమికల్‌‌ ఫ్రీ క్లెన్సర్‌‌‌‌ వాడటం మంచిది.
  • మాయిశ్చరైజర్‌‌‌‌, సన్‌‌స్క్రీన్‌‌ లోషన్‌‌ చర్మానికి బెస్ట్‌‌ఫ్రెండ్స్‌‌. అందుకే, ప్రతిరోజు వాటిని తప్పకుండా రాసుకోవాలి. మాయిశ్చరైజర్‌‌‌‌తో మసాజ్‌‌ చేసుకుంటే చర్మంలో నీటి శాతం పెరుగుతుంది. సన్‌‌స్క్రీన్‌‌ లోషన్‌‌ వాడటం వల్ల యూవీ రేస్‌‌ నుంచి చర్మాన్ని కాపాడుకోవచ్చు. చర్మం కూడా ముడతలు పడదు. ఎండలోకి వెళ్లినప్పుడే కాకుండా వంట చేస్తున్నప్పుడు కూడా సన్‌‌స్క్రీన్‌‌ లోషన్‌‌ వాడాలి. 
  • రాత్రి పడుకునేముందు సీరమ్‌‌ అప్లై చేస్తే యాంటీ ఏజింగ్‌‌ ప్రాబ్లమ్స్‌‌ రావు.ఇవన్నీ చేయడంతో పాటు కచ్చితంగా కనీసం 20 నిమిషాలు వాకింగ్‌‌ చేయాలి. పిల్లలతో ఆడుకోవాలి. అలా చేస్తే కొన్ని హార్మోన్స్‌‌ రిలీజయ్యి స్ట్రెస్‌‌ తగ్గుతుంది. 
  • పిల్లలతో డాన్స్‌‌ చేయాలి. తాజా జ్యూసులు తాగి, కంటినిండా నిద్రపోతే చర్మం బాగుంటుంది.