- కుమ్రంభీం అసిఫాబాద్ జిల్లా పెంచికల్పేట్లో చోరీ
కుమ్రంభీం అసిఫాబాద్ జిల్లా పెంచికల్ పేట్ లోని ఒక ఇంట్లో చోరీ జరిగింది. ఇంటి తలుపులు పగలకొట్టి, బీరువాలో ఉన్న నగదు, బంగారం ఎత్తుకెళ్లారు దొంగలు. చోరీ జరిగిన ఇల్లు ఈస్గామ్ పోలీసు స్టేషన్ లో ఎస్ఐగా పని చేస్తున్న జగదీష్ ది. పెంచికల్ పేట పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు.
ఇంటికి ఉన్న సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించగా.. అర్ధరాత్రి దాటిన తర్వాత ఓ దొంగ ముసుగు వేసుకుని తలుపులు పగులగొట్టి ఇంట్లోకి ప్రవేశించాడు. బీరువాలోని నగదు, బంగారు ఆభరణాలు తీసుకుని వెళ్లిపోయాడు. సీసీ ఫుటేజీ ఆధారంగా దొంగను పట్టుకుని చోరీ సొత్తును రికవరీ చేసేందుకు ప్రయత్నం చేస్తున్నామని ఎస్సై రామన్ తెలిపారు.
