కత్తితో బెదిరించి 50 లక్షలు దోచుకున్నరు

  కత్తితో బెదిరించి 50 లక్షలు దోచుకున్నరు

హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లా కాటేదాన్ పారిశ్రామిక వాడలో దొంగలు హల్ చల్ సృష్టించారు. కంపెనీ వాచ్మన్ను కత్తితో బెదరించి బ్యాటరీ ఫ్యాక్టరీలోకి దుండగులు చొరబడ్డారు. బీరువా పగలగొట్టి అందులో ఉన్న రూ. 50 లక్షల నగదును తీసుకుని పారిపోయారు.

పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించారు. అయితే తెలిసిన వాళ్లే దోపిడీకి పాల్పడి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.