చోరీ చేసేందుకు సీసీ కెమెరా పగులగొట్టి పని కానిస్తుంటే…

చోరీ చేసేందుకు సీసీ కెమెరా పగులగొట్టి పని కానిస్తుంటే…

సంగారెడ్డి జిల్లా: బ్యాంకులో చోరీకి ప్రయత్నించిన దొంగలు సైరన్ మోగితే కనుక్కోలేకపోయారు. సీసీ కెమెరాను ధ్వంసం చేస్తుంటే వచ్చిన సౌండ్ అనుకుని పొరపడి తమ చోరీ ప్రయత్నాన్ని కొనసాగిస్తుంటే.. సైరన్ శబ్దంతో అలర్టయిన పోలీసులు హుటాహుటిన ఏటీఎం వద్దకు చేరుకున్నారు. చోరీ చేసేపనిలో ఉన్న ముగ్గురు దొంగల్లో ఒకడు పోలీసుల రాకను పసిగట్టి కేకలు వేస్తూ పరార్ కాగా.. హఠాత్తుగా పోలీసుల రాకతో షాక్ తిన్న మిగిలిన ఇద్దరు దొంగలు కూడా పారిపోయేందుకు ప్రయత్నించగా పోలీసులు వెంటాడి పట్టుకున్నారు.  పుల్కల్ మండలం శివంపేట బస్టాండ్ సమీపంలోని ఏపీజీవీబీ బ్యాంకు వద్ద జరిగిందీ ఘటన. బ్యాంకులో చోరీ కోసం రెక్కీ చేసి సిద్ధమైన ముగ్గురు దొంగలు చాకచక్యంగా బ్యాంకు తాళం పగలగొట్టి అటు తర్వాత సిసి కెమెరా ధ్వంసం చేశారు. ఇక తమకు అడ్డులేదనుకుని చాలా ధైర్యంగా చోరీ పనిని కానిస్తుంటే బ్యాంకులో చోరీ జరుగుతున్నట్లు  సైరన్ మొగడంతో పుల్కల్ ఎస్సై నాగలక్మి హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. పోలీసుల రాకను పసిగట్టిన ఒక దొంగ సహచరులను అప్రమత్తం చేస్తూ పారిపోగా.. చోరీ పనిలో నిమగ్నమై హఠాత్తుగా పోలీసుల రాకను గుర్తించడంలో ఆలస్యం చేసిన మరో ఇద్దరు పారిపోయేందుకు విఫలయత్నం చేశారు. అయితే పోలీసులు వెంటాడి పట్టుకోవడంతో కటకటాలు లెక్కిస్తున్నారు.

For More News..

టీవీ నటుడు అమర్ అరెస్ట్.. చర్లపల్లి జైలుకు తరలింపు

పెళ్లికి రెడీ అవుతున్నారా..? అయితే ఏం చేయాలంటే..

మా అడవిని అమ్మనీయం

పర్యావరణ విధ్వంసంతోనే ప్రకృతి విపత్తులు

పుస్తకాల్లో భాష మారాలె