మనసున్న శ్రీమంతుడు బడి కట్టించిండు

మనసున్న శ్రీమంతుడు బడి కట్టించిండు

పిల్లల్ని అన్ని ఫెసిలిటీస్​ ఉన్న స్కూల్లో చదివించాలి అనుకుంటారు తల్లిదండ్రులు. కానీ, చాలామందికి పేదరికం అడ్డొస్తుంది. అయితే, కామారెడ్డి జిల్లా బీబీపేట మండలం చుట్టుపక్కల ఉన్న ఊళ్ల వాళ్లకి ఆ సమస్య లేదు. అక్కడ పేదపిల్లల కోసం కార్పొరేట్​ స్కూళ్లని తలపించే స్కూల్​ కట్టించాడు తిమ్మయ్యగారి సుభాష్​ రెడ్డి. నలుగురికీ సాయం చేయాలనుకునే అతన్ని.. ఆరేండ్ల క్రితం తెలుగులో వచ్చిన‘ శ్రీమంతుడు’ సినిమా  ఇన్​స్పైర్​ చేసిందట. సుభాష్​ రెడ్డి సొంతూరు బీబీపేట్​ మండలం లోని జనగాం. హైదరాబాద్​లో కన్​స్ట్రక్షన్​ బిల్డర్​గా సెటిలయ్యాడు. నలుగురికీ హెల్ప్​ చేయాలన్న ఈయన జర్నీ నిన్నమొన్న మొదలైంది కాదు. దాదాపు 20 ఏండ్ల నుంచి నడుస్తోంది.​ చదువుని, ట్రీట్​మెంట్​ని సాయం అడిగితే కాదనడు. 
 
సినిమా ఎఫెక్ట్​తో..

‘శ్రీమంతుడు’ సినిమా చూసి అందరిలానే సుభాష్​ కూడా ‘నేను చదువుకున్న బడి, మా ఊళ్లో గుడి మంచిగ చేయాలె, హాస్పిటల్​ కట్టాలె’ అనుకున్నాడు. ఒకరోజు వాళ్ల అబ్బాయి పేపర్​ చూస్తూ, ‘శ్రీమంతుడు సినిమా చూసి చాలామంది ఇన్​స్పైర్​ అయ్యారు. సొంతూళ్లని డెవలప్​  చేస్తున్నారు’ అన్నాడు సుభాష్​తో. అప్పుడు సుభాష్​  ‘అవును... నేను కూడా​ ‘గ్రామజ్యోతి’ ప్రోగ్రాంలో పార్టిసిపేట్​ చేస్తున్నా’ అన్నాడు. దానికి వాళ్ల అబ్బాయి ‘వెళ్లు కానీ, శ్రీమంతుడు సినిమాలో హీరోలా నువ్వు నా సైకిల్​ మాత్రం తీసుకెళ్లకు’ అన్నాడట. దాంతో తను పుట్టిపెరిగిన ఊరికోసం ఏదైనా చేయాలనుకున్నాడు. సొంత డబ్బులతో ఊళ్లో కొత్త పంచాయతి బిల్డింగ్​ కట్టించాడు. రోడ్లు వేయించాడు. స్ట్రీట్​లైట్స్​, వాటర్​ ప్లాంట్ కూడా పెట్టించాడు.  

స్కూల్​ ఆలోచన వెనక..

ఒకసారి సుభాష్​ తన టెన్త్​క్లాస్​ ఫ్రెండ్స్​తో కలిసి బీబీపేట్​లో వాళ్లు చదువుకున్న స్కూల్​కి వెళ్లాడు. వర్షానికి కురుస్తున్న పై కప్పులు, పాత గోడలు, కూలిపోయిన క్లాస్​ రూమ్​లని చూసి గుండె తరుక్కు పోయింది. తలాకొన్ని డబ్బులు వేసి స్కూల్​ బిల్డింగ్​ రిపేర్​ చేయించాలి అనుకున్నారు. కానీ, సుభాష్​  మాత్రం కార్పొరేట్​ స్కూళ్లలా, అన్ని ఫెసిలిటీస్​ ఉన్న స్కూల్​ కట్టించాలి అనుకున్నాడు. సొంత డబ్బుతో  అమ్మానాన్న జ్ఞాపకార్థంగా రాష్ట్రంలోనే అన్ని ఫెసిలిటీస్​ ఉన్న గవర్నమెంట్​ స్కూల్​ కట్టించాడు. డిజిటల్​ క్లాస్​రూమ్​లు, మోడర్న్​  లైబ్రరీ, ల్యాబ్స్, టీచర్లకి రెస్ట్ రూమ్స్​, ప్లే గ్రౌండ్  ఉన్న స్కూల్​ కట్టించాడు. అందుకోసం సుభాష్​ ఆరు కోట్ల రూపాయలు ఖర్చుచేశాడు. 

రూ.2 కోట్లతో కార్పస్​ ఫండ్

కార్పొరేట్​ స్కూల్​ని తలపించేలా స్కూల్​ కట్టడం తోనే ఆగిపోకుండా..​. స్కూల్​ మెయింటెనెన్స్​ కోసం రెండు కోట్ల రూపాయల కార్పస్​ ఫండ్​ డిపాజిట్​ చేయాలనుకున్నాడు. ఇప్పటి వరకూ కోటి 20 లక్షల రూపాయలు జమచేశాడు. అంతేకాదు జీవితంలో సక్సెస్​ అయిన వాళ్లతో పిల్లలకి నెలకొకసారి మోటివేషన్​ క్లాసులు చెప్పించాలి అనుకుంటున్నాడు సుభాష్​.  

 సంతోష్​ బొందుగుల

మరిన్ని వివరాల కోసం: 

డాలర్ శేషాద్రి ప్రస్థానం.. ప్రశంసలు, వివాదాలు

ఇండియాలో కూడా వివక్షకు గురయ్యా

మంత్రి అండతో ప్రభుత్వ భూములు కబ్జా