విపక్షాలు కూటమి గురించి కాదు.. ఢిల్లీ గురించి ఆలోచించాలి

విపక్షాలు కూటమి గురించి కాదు.. ఢిల్లీ గురించి ఆలోచించాలి

విపక్షాలు కూటమి గురించి కాకుండా ఢిల్లీ గురించి ఆలోచించాలన్నారు కేంద్రహోంమంత్రి అ మిత్ షా.  గురువారం లోక్‌సభలో గవర్నమెంట్ ఆఫ్ నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ (సవరణ) బిల్లు, 2023ని ప్రవేశపెట్టారు అమిత్ షా.ఈ సందర్భంగా ఢిల్లీ ఆర్డినెన్స్ సవరణ బిల్లుపై లోక్ సభలో హాట్ హాట్ చర్చ జరిగింది. ఢిల్లీ కోసం చట్టాలు చేసే అధికారం పార్లమెంట్ కు ఉందన్నారు అమిత్ షా. ఎవరి అధికారాలను గుంజుకోవాలనే ఉద్దేశ్యం లేదన్నారు. 

దేశానికి, ఢిల్లీకి మంచి కోసమే ఈ సవరణ బిల్లు తీసుకొస్తున్నట్లు చెప్పారు అమిత్ షా.కూటమి ఉన్నప్పటికీ రాబోయే ఎన్నికల్లో మోడీ పూర్తి మెజారిటీతో గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు. జవహర్ లాల్ నెహ్రూ, అంబేద్కర్, సి రాజగోపాలాచారి, రాజేంద్ర ప్రసాద్, బిఆర్ అంబేద్కర్ వంటి నేతలు ఢిల్లీకి రాష్ట్ర హోదాను వ్యతిరేకించారన్నారు. 

ఢిల్లీ ఆర్డినెన్స్ ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధమన్నారు కాంగ్రెస్ లోక్ సభ పక్ష నేత అధిర్ రంజన్ చౌదరి. అవసరం వచ్చినప్పుడు నెహ్రూ పేరును బీజేపీ ఉపయోగించుకోవడం కామన్ అయ్యిందన్నారు. ఢిల్లీ అధికారాలను గుంజుకోవడం సరికాదన్నారు.