థర్డ్ డోస్​తో ఒమిక్రాన్‌ నుంచి 88%  రక్షణ

థర్డ్ డోస్​తో ఒమిక్రాన్‌ నుంచి 88%  రక్షణ

లండన్: కరోనా థర్డ్ డోస్ తీసుకుంటే ఒమిక్రాన్ వేరియంట్ నుంచి గణనీయంగా రక్షణ ఉంటుందని యూకే హెల్త్ సెక్యూరిటీ ఏజెన్సీ నిర్వహించిన స్టడీలో వెల్లడైంది. రెండు డోసుల టీకా తీసుకున్న వాళ్లతో పోలిస్తే.. మూడు డోసుల టీకా తీసుకున్న వాళ్లకు ఒమిక్రాన్ సోకితే హాస్పిటల్ లో చేరే ముప్పు 88% తక్కువగా ఉంటుందని తమ స్టడీలో గుర్తించినట్లు ఏజెన్సీ రీసెర్చర్లు వెల్లడించారు. లక్షలాది మంది ఒమిక్రాన్ బాధితులపై జరిగిన రెండు వేర్వేరు స్టడీల రిపోర్టులను తాము విశ్లేషించిన తర్వాత ఈ మేరకు ఒక కన్ క్లూజన్ కు వచ్చినట్లు పేర్కొన్నారు. అలాగే సెకండ్ డోస్ తీసుకున్న ఆరు నెలల తర్వాత ఒమిక్రాన్ కు వ్యతిరేకంగా వ్యాక్సిన్ పనితీరు 52 శాతం తగ్గుతుందని అమెరికాలోని స్క్రిప్స్ రీసెర్చ్ ట్రాన్స్ లేషనల్ ఇనిస్టిట్యూట్ డైరెక్టర్ ఎరిక్ టోపోల్ హెచ్చరించారు. బూస్టర్ డోస్ తీసుకున్న వాళ్లకు మాత్రం ఒమిక్రాన్​ వేరియంట్​ సోకే ముప్పు 
భారీగా తగ్గుతుందన్నారు.