‘ఛాంపియన్’ మూవీ నుంచి మూడో పాట రిలీజ్

‘ఛాంపియన్’ మూవీ నుంచి మూడో పాట  రిలీజ్

రోషన్, అనస్వర రాజన్‌‌‌‌ జంటగా ప్రదీప్ అద్వైతం రూపొందించిన  పీరియాడిక్ స్పోర్ట్స్ డ్రామా ‘ఛాంపియన్’. జీ స్టూడియోస్ సమర్పణలో స్వప్న సినిమాస్, ఆనంది ఆర్ట్ క్రియేషన్స్, కాన్సెప్ట్ ఫిల్మ్స్ సంస్థలు నిర్మించాయి.  డిసెంబర్ 25న సినిమా విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్, సాంగ్స్‌‌‌‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది.

 తాజాగా ఈ చిత్రం నుంచి మూడో పాటను హీరోయిన్  సమంత లాంచ్ చేసి టీమ్‌‌‌‌కు బెస్ట్ విషెస్ చెప్పింది. ‘ఐ యామ్ ఎ ఛాంపియన్’  అంటూ సాగిన పాటను మిక్కీ జే మేయర్ కంపోజ్ చేయగా, కేకే క్యాచీ లిరిక్స్ రాశాడు. పి జయరామ్, రమ్య బెహ్రా కలిసి పాడారు. ‘కమ్ కమ్.. ఛాంపియన్.. లెట్స్ డ్యాన్స్ ఛాంపియన్.. నాతో ఆడిపాడరా తేనేకళ్ల హ్యాండ్సమ్.. అందుకోరా రిథమ్.. పెంచుకోరా వాల్యూమ్.. జామురాతిరేలా.. జాగు ఇంకా ఏలా..’ అంటూ కలర్‌‌‌‌‌‌‌‌ఫుల్‌‌‌‌గా సాగిందీ పాట.

 రోషన్, అవంతిక  ఎనర్జిటిక్ డ్యాన్స్ మూమెంట్స్‌‌‌‌తో ఆకట్టుకున్నారు.   పోనీ వర్మ కొరియోగ్రఫీ ఈ పాటకు ప్రధాన హైలైట్‌‌‌‌గా నిలుస్తూ, స్టైలిష్ హుక్ స్టెప్‌‌‌‌తో  పాటు డైనమిక్  డ్యాన్స్ మూవ్స్‌‌‌‌తో విజువల్స్‌‌‌‌ను మరో లెవల్‌‌‌‌కి తీసుకెళ్లింది.  ఈ చిత్రంలో నందమూరి కల్యాణ్ చక్రవర్తి, అర్చన కీలక పాత్రల్లో కనిపించనున్నారు.