మధ్యప్రదేశ్‌లో ప్రియుడితో కలిసి భర్తను చంపేసిన మూడో భార్య

మధ్యప్రదేశ్‌లో ప్రియుడితో కలిసి భర్తను చంపేసిన మూడో భార్య

భోపాల్‌: వారసుల కోసమని మూడు పెళ్లిళ్లు చేసుకున్న 60 ఏండ్ల వ్యక్తి ఆఖరికి మూడో భార్య చేతిలో హత్యకు గురయ్యాడు. మధ్యప్రదేశ్‌లోని అనుప్పూర్‌‌ జిల్లాలో మూడ్రోజుల కింద జరిగిన ఈ మర్డర్‌‌ మిస్టరీ ఆదివారం బయటపడింది. భయ్యాలాల్ రాజన్‌కు మూడు వివాహాలు జరిగాయి. మొదటి భార్య అతడిని విడిచిపెట్టిడంతో గుడ్డీబాయిని రెండో పెళ్లి చేసుకున్నాడు. సంతానం కలగకపోవడంతో ఆమె చెల్లెలు మున్నీబాయిని మూడో పెండ్లి చేస్కున్నాడు. 

భయ్యాలాల్‌కు ఆమెతో ఇద్దరు పిల్లులు పుట్టారు. మూడోభార్య మున్నీ.. స్థానిక రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి నారాయణ్‌దాస్‌తో అక్రమ సంబంధం పెట్టుకుంది. తమిద్దరి మధ్య భయ్యాలాల్‌ అడ్డుగా ఉన్నాడని చంపేద్దామనుకున్నారు. సాయం చేసేందుకు ధీరజ్‌ అనే యువకుడిని పెట్టుకున్నారు. ఆగస్ట్‌ 30న భయ్యాలాల్‌ ఇంట్లో నిద్రిస్తుండగా నారాయణ్‌దాస్‌, ధీరజ్‌ లోపలికి వెళ్లి ఇనుప రాడ్‌తో అతడి తలపై కొట్టి చంపేశారు. డెడ్‌బాడీని ఊరి చివరి బావిలో పడేశారు. 

భర్త కోసం గాలిస్తున్న రెండో భార్య.. ఊరి చివరి బావిలో డెడ్‌బాడీ తేలడం గమనించి పోలీసులకు సమాచారమివ్వడంతో అసలు విషయం బయటపడింది. మున్నీబాయి, నారాయణ్‌దాస్‌, ధీరజ్‌ను అరెస్ట్‌ చేశారు.