మూడో పాటకు ముహూర్తం

మూడో పాటకు ముహూర్తం

నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘దసరా’. సుధాకర్ చెరుకూరి నిర్మాత. కీర్తి సురేష్ హీరోయిన్‌‌‌‌గా నటిస్తోంది. తెలుగు, తమిళ, కన్నడ,  మలయాళ, హిందీ భాషల్లో మార్చి 30న సినిమా రిలీజ్ కానుంది. ఇప్పటికే  ప్రమోషన్స్‌‌‌‌లో స్పీడ్ పెంచిన మేకర్స్.. రెండు పాటలు విడుదల చేయగా వాటికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు మూడో పాటకు ముహూర్తం పెట్టారు. మార్చి 8న ‘చమ్కీల అంగీలేసి’ అంటూ సాగే వెడ్డింగ్ సాంగ్‌‌‌‌ను రిలీజ్ చేయనున్నట్టు కొత్త పోస్టర్‌‌‌‌‌‌‌‌తో అనౌన్స్ చేశారు. ఇందులో నాని, కీర్తి సురేష్ స్కూటర్‌‌‌‌‌‌‌‌పై వెళ్తూ, వింటేజ్ లుక్‌‌‌‌లో కనిపిస్తున్న తీరు ఆకట్టుకుంది. దీక్షిత్ శెట్టి, సముద్రఖని, సాయి కుమార్, జరీనా వహాబ్ ఇతర ముఖ్యపాత్రలు పోషించిన ఈ చిత్రానికి సంతోష్ నారాయణ్ సంగీతం అందించాడు.