లైవ్ లో ఫుట్ బాల్ ను వదిలి.. బట్టతల వెంట పడ్డ కెమెరాలు

లైవ్ లో ఫుట్ బాల్ ను వదిలి.. బట్టతల వెంట పడ్డ కెమెరాలు

కెమెరాల తప్పిదం వల్ల ఫుట్ బాల్ గేమ్ కన్ఫ్యూజన్ గేమ్ గా మారింది. లైవ్ చూసే ప్రేక్షకులను తికమక పెట్టాయి కెమెరాలు. మాములుగా ఫుట్  బాల్ గేమ్  లో కెమెరా ఫోకస్ మొత్తం ఫుట్  బాల్  పైనే ఉంటుంది. గ్రౌండ్  లో అంత మంది ఆటగాళ్లున్నా బాల్  నే టార్గెట్ చేస్తుంది. ఆ బాల్ ఎటు వెళ్తే కెమెరా అటు తిరుగుతూ.. టీవీ లైవ్  లో ప్రేక్షకులకు చూపిస్తుంది. అయితే కొన్నిసార్లు మనుషులే కెమెరాను ఆపరేట్ చేస్తే.. కొన్ని సార్లు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI)  కెమెరాలు ఆటోమేటిగ్గా బాల్  పై ఫోకస్ పెడతాయి. ఇటీవల  స్కాట్లాండ్ లో జరిగిన ఓ పుట్  బాల్ మ్యాచ్  లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్  కెమెరా రచ్చరచ్చ చేసింది. ఫుట్ బాల్ ఏదో.. మనుషుల తలలు ఏవో సరిగ్గా గుర్తించకుండా లైవ్ మొత్తాన్ని పాడు చేసింది.

లైన్  మ్యాన్ బట్టతలను చూసి ఫుట్  బాల్ గా పొరపాటు పడిన ఆ కెమెరా… ఫుట్ బాల్ కు బదులు అతడి తలనే ఫోకస్ చేసింది.  ప్రోగ్రామ్ ప్రకారం పనిచేసిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్  కెమెరా.. గ్రౌండ్లో ఫుట్  బాల్ పై ఫోకస్ పెట్టకుండా లైన్ మెన్ బట్టతలను ఫోకస్ చేసింది. బట్టతలను చూసి ఫుట్ బాల్ గా పొరబడి.. అతడినే చూపించింది. ఇరు జట్ల సభ్యులు ఫుట్ బాల్ కోసం పోటీపడుతుంటే.. అది చూపించకుండా.. లైన్ మెన్ ను చూపించడంతో.. ఆడియెన్స్ కన్  ఫ్యూజ్ అయ్యారు.